వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెసర్ లైంగికంగా వేధించారు; కాకినాడ జెఎన్‌టియు విద్యార్థినుల ఫిర్యాదు...కలకలం

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కాకినాడ జెఎన్‌టియులో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులతో విసిగిపోయిన విద్యార్థినులు ఆయన బారి నుంచి కాపాడాలంటూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన యూనివర్శిటీ వీసి విచారణకు ఆదేశించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్ఫష్టం చేశారు.

జెఎన్‌టియుకెలో ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నరెండు విభాగాల విద్యార్థులకు జనవరి 23, 24, 25 తేదీల్లో ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల సందర్భంగా ప్రొఫెసర్ బాబులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

 ల్యాబ్ లోజరగాల్సిన పరీక్షలు...క్యాబిన్ లో...

ల్యాబ్ లోజరగాల్సిన పరీక్షలు...క్యాబిన్ లో...

కాకినాడ జెఎన్‌టియులో ఎంటెక్‌ ఫస్ట్ ఇయర్ సి అండ్ సిఈ, విఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఈఎస్‌ కోర్సు చదువుతున్నవిద్యార్థులకు ఈనెల 23, 24, 25 తేదీల్లో ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల సందర్భంగా ల్యాబులో నిర్వహించాల్సిన వైవాను వ్యక్తిగత క్యాబిన్‌లో నిర్వహించారు.
దీనికి ఎగ్జామినర్‌గా వ్యవహరించిన డాక్టర్ కె.బాబులు అనే ప్రొఫెసర్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్థినులు శనివారం యూనివర్శిటీ రిజిస్ట్రార్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

బాయ్స్ ను వెంటనే బైటకు...మమ్మల్ని మాత్రం

బాయ్స్ ను వెంటనే బైటకు...మమ్మల్ని మాత్రం

వైవా సందర్భంగా బాయ్స్ ను వెంటనే బయటకు పంపివేసిన ప్రొఫెసర్ తమను మాత్రం చాలా సేపు తన క్యాబిన్‌లోనే ఉంచారని...కఠినమైన ప్రశ్నలు అడిగి వాటిపై సమాధానం ఆలోచిస్తున్నసమయంలో చాలా వల్గర్ గా ప్రవర్తించారని విద్యార్థినులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 పలుసార్లు తాకారు...ఫోన్ నంబర్లు అడిగారు...

పలుసార్లు తాకారు...ఫోన్ నంబర్లు అడిగారు...

వైవా సమయంలో ప్రొఫెసర్ కావాలని పలుమార్లు తమ శరీరాన్నిఅభ్యంతరకరంగా, ప్రయివేట్ పార్ట్ వద్ద తాకినట్లు విద్యార్ధినులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు కావాలని అడిగి తీసుకున్నారని విద్యార్థినులు ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థినులకు ఇదే అనుభవం ఎదురయ్యిందని వివరించారు. ప్రొఫెసర్ ఈ విధంగా ప్రవర్తిస్తారని తాము అస్సలు ఊహించలేదని, తమను ఆయన బారినుంచి కాపాడాలని విద్యార్థినులు తమ ఫిర్యాదులో విన్నవించుకున్నారు.

 తక్షణ విచారణకు ఆదేశం...

తక్షణ విచారణకు ఆదేశం...

ఎంటెక్ విద్యార్థినుల లిఖిత పూర్వక ఫిర్యాదు జెఎన్ టియు లో కలకలం రేపింది. దీనిపై వెంటనే స్పందించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి వీఎస్‌ఎస్‌ కుమార్‌ తక్షణం విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అయిదుగురు సభ్యులతో కమిటీని విసి నియమించారు. శనివారం ఉపకులపతి కుమార్‌ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్‌ సుబ్బారావును కలిసి విద్యార్థినులు తమ గోడు వినిపించారు. బాధ్యుడైన ఆచార్యుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థినుల నుంచి ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని ధృవీకరించారు. ఈ సమాచారం విసికి తెలపగా ఆయన ఆదేశాల మేరకు దీనిపై విచారణకు అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

English summary
East Godavari: Post graduate students of the JNTU,Kakinada have registered a complaint of sexual harassment against the Professior Babulu. The complaint was lodged with the college authorities on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X