వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"చంద్రబాబు కుర్చీలోంచి పడిపోతున్నారు, మంత్రికి ఒళ్లు పెరిగింది కానీ..."

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, మంత్రి అచ్చెన్నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

అధికార టిడీపి ఓ డ్రామాల పార్టీ అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, డ్రామాలు, అవినీతే అని ఆయన అన్నారు. విలువలు, విశ్వసనీయత కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సోనియాను ఎదిరించారని ఆయన అన్నారు.

ఆ మంత్రికి ఒళ్లు పెరిగింది కానీ...

ఆ మంత్రికి ఒళ్లు పెరిగింది కానీ...

మంత్రి అచ్చెన్నాయుికి ఒళ్లు పెరిగింది, ఆయన కండలు పెంచారు గానీ బుద్ధి మాత్రం పెరగలేదని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 అప్పటి నుంచి చంద్రబాబు ఇలా.

అప్పటి నుంచి చంద్రబాబు ఇలా.

బడ్జెట్ ప్రవేశపెట్టనప్పటి నుంచి చంద్రబాబు కోపంతో ఉన్నారన, కుర్చీలోంచి లేచి పడిపోతున్నారని జోగి రమేష్ అన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పగటి వేషగాళ్ల మాదిరిగా పార్లమెంటులో కనిపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 తృణప్రాయంగా వదులుకునేందుకు

తృణప్రాయంగా వదులుకునేందుకు

పార్టీ అధినేత జగన్ సూచన మేరకు తమ పార్టీ ఎంపీలు ఏడాదికి పైగా ఉన్న పదవీ కాలాన్ని ప్రత్యేక హోదా సాధన కోసం తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధపడ్డారని జోగి రమేష్ అన్నారు. అదే సమయంలో టిడిపి ఎంపీలు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతున్నది వాస్తవం కాదా అని అడిగారు.

 నక్కకు, నాకలోకానికి మధ్య

నక్కకు, నాకలోకానికి మధ్య

చంద్రబాబుకు,జగన్‌కు ధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని అచ్చెన్నాయుడు గుర్తించాలని జోగి రమేష్ అన్నారు పిల్లనిచ్చిన మామమ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు పోయేందుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడికి ఆ విషయాలు తెలియదా అని అడిగారు.

చంద్రబాబు గుండెల్లో రైళ్లు

చంద్రబాబు గుండెల్లో రైళ్లు

జగన్ ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలనుకుంటే జగన్ వెంట ప్రయాణించాలని, వద్దనుకునేవాళ్లు చంద్రబాబుతో ఉండాలని ఆయన అన్నారు.

English summary
The YSR Congress party leader Jogi Ramesh made serious comments on Andhra Pradesh CM and the Telugu Desam party chief Nara Chandababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X