Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ బీఆర్ఎస్ లో చేరికలు: కారెక్కిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల!!

ఏపీ బీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతలతో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న కేసీఆర్, ఏపీలోని పలువురు నాయకులను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాదు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లటం కోసం కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో తాను అడుగు పెట్టటమే బలంగా పెట్టాలని, చాప క్రింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న కేసీఆర్ ఏపీ ప్రజల మన్ననలు పొందటం కోసం అనుసరించవలసిన వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీలోకి ఏపీ నుండి చేరికలు

బీఆర్ఎస్ పార్టీలోకి ఏపీ నుండి చేరికలు


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ప్రకటించి రంగంలోకి దింపిన కేసీఆర్ సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆసక్తికర రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ ప్రజల మధ్యకు వస్తే ఏం హామీలు ఇవ్వాలి, ఏపీ ప్రజలకు ఏం అవసరం.. ఎలా అయితే ఏపీలో పాగా వెయ్యొచ్చు అన్నది అధ్యయనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ పార్టీలోకి ఏపీ నుండి చేరికలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల

బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల


ఇప్పటికే రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్ధసారధి వంటి నాయకులు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తుంటే, ఇతర పార్టీలలో ప్రాధాన్యత తగ్గిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు చూడడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల. గుంటూరు జెకెసి కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బి ఆర్ ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో తాడి శకుంతల బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

తాడి శకుంతలతో పాటు బీఆర్ఎస్ లో చేరిన పలువురు నాయకులు

తాడి శకుంతలతో పాటు బీఆర్ఎస్ లో చేరిన పలువురు నాయకులు

తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మల్యాద్రి సహా పలువురు మైనారిటీ నేతలు కూడా పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల గతంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పొత్తులలో భాగంగా 2005- 2006లో సిపిఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోనూ, టిడిపిలోను కొంత కాలం పాటు పనిచేశారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ వైసీపీలో క్రియాశీలకంగా ఆమె పనిచేయడం లేదు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ నాయకురాలుగా మారారు. మరి బిఆర్ఎస్ లో తాడి శకుంతల ఏ మేరకు పని చేస్తారనేది ఆలోచించాల్సిన అంశమే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+