ఇండియాలో రిచెస్ట్ గోల్డ్ బిజినెస్ మెన్
బంగారు నగల వ్యాపారంలో శరవేగంగా దూసుకువెళుతున్న ఆ వ్యక్తి దేశంలోని తొలి 100 మంది కుబేరుల్లో 50 వ స్థానంలో నిలిచారు. బంగారు నగల వ్యాపారంలో ప్రథమస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ లిస్ట్‌లోని భారత ధనవంతుల్లో ఆయన గత ఏడాది 69వ స్థానంలో ఉండగా.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరుకున్నారు. ప్రముఖ జ్యుయలరీ కంపెనీ జాయ్ అలుక్కాస్ ఛైర్మన్, ఎండీ జయ్ అలుక్కాస్.
రూ.36వేల కోట్ల సంపాదన
ఫోర్బ్స్ ప్రకారం సుమారు 4.4 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ. 36 వేల కోట్లుగా అతని సంపాదన ఉంది. ఆయన నేతృత్వంలోని జయ్ అలుక్కాస్ గ్రూప్ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,513 కోట్ల టర్నోవర్ సాధించాయి. దీంతో ఆయన వ్యక్తిగత సంపద మరింత పెరిగింది. గ్రూప్ నికర లాభం రూ. 899 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 17,500 కోట్ల టర్నోవర్ సాధించాలని , నెట్ ప్రాఫిట్ రూ. 1100 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బంగారం ధనవంతుల్లో ఆయన అగ్రస్థానంలో ఉండడమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ జువెలరీ రిటైల్ స్టోర్ ను చెన్నైలో కలిగి ఉన్నది కూడా ఆయనే.

మొత్తం 160 షోరూమ్స్
తండ్రి అలుక్కాస్ వర్గీస్ వేసిన పునాదులపై జాయ్ అలుక్కాస్ అతిపెద్ద బంగారం సామ్రాజ్యాన్ని నిర్మించారు. అలుక్కాస్ వర్గీస్ మరణం తర్వాత ఆయన ఐదుగురు కుమారులు జువెలరీ వ్యాపారాన్ని పంచుకోగా.. వారిలో జాయ్ లుక్కాస్ దుబాయిలోని మూడు షోరూమ్స్ ను తన వద్దే ఉంచుకున్నారు. మిగిలిన ముగ్గురు కుమారులు రెండు షోరూమ్‌లు తీసుకున్నారు. ఏడాదిలో ఐదు నెలలు కేరళలోని త్రిస్సూర్‌లో తన ఇంట్లో ఉంటానని చెప్పారు జాయ్ అలుక్కాస్. ప్రస్తుతం ఈ గ్రూప్ నకు ప్రపంచ వ్యాప్తంగా 160 షోరూమ్‌లున్నాయి. అందులో భారత్‌లోనే 100 షోరూమ్‌లు ఉన్నాయి. ఈ సంఖ్యను 130కి చేర్చాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.












Click it and Unblock the Notifications