అనంతపురంలో హైటెన్షన్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా !
జూనియర్ ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సదరు ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ లీక్ అయ్యింది. నేను అనంతపురం ఎమ్మెల్యే.. వార్ 2 సినిమా ఆడదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం రేపాయి.
ఎమ్మెల్యే ఇంటి ముట్టడి..
ఈ వ్యవహారంపై అనంతపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని ముట్టడించి నిరసన తెలుపుతూ.. ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని జూనియర్ ఎన్టీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే రియాక్షన్..
ఇక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ ఆడియో కాల్స్ నావి కావు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు. గత 16 నెలలుగా నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడూ ఇష్టంగా చూసేవాడిని. ఆడియోలో ఎలాంటి నిజం లేదు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసును నొప్పించుకున్నట్లయితే, నా తరఫున క్షమాపణ చెబుతున్నాను" అని అన్నారు. అలాగే ఈ అంశంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయట పెడతారని స్పష్టం చేశారు.
నందమూరి కుటుంబంలో గ్యాప్..
ఈ వివాదం నందమూరి కుటుంబంలోని వాతావరణాన్ని కూడా మరోసారి వెలుగులోకి తెచ్చింది. గత కొంతకాలంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల మధ్య గ్యాప్ ఉందన్న చర్చ ఓపెన్‌గా సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్‌లో మాత్రమే ఒకసారి కలసి కనిపించారు. ఆ తర్వాత కుటుంబ కార్యక్రమాల్లో కూడా కలిసి కనిపించలేదు. అయితే, కళ్యాణ్ రామ్-జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తరచూ కలసి కనిపిస్తూ అభిమానులను హ్యాప్పీ చేస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ సైతం వార్ 2 కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదాలు ఉన్నంత కాలం తనను ఎవరు ఆపలేరని చెప్పారు.

మరోవైపు వార్ 2' సినిమా మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ పర్వాలేదనిపించినా.. రెండో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో హిందీలో అద్భుతమైన జోరును చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'కూలీ' సినిమా ప్రభావం వలన కలెక్షన్స్ కొంత తగ్గినా, ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో మంచి వసూళ్లు సాధించింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications