పోటీ చేయను, టిడిపికి ప్రచారం చేస్తా: ఎన్టీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహాగానాలకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తెర దించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఎన్టీ రామారావు వంటి మహానుభావుడు మళ్లీ పుట్టబోడని ఆయన అన్నారు. అనుభవం, వయస్సు రీత్యా తాను రాజకీయాల్లోకి రాలేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం తన బాధ్యత అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తన రక్తంలో ఉందని ఆయన అన్నారు.

జూ. ఎన్టీఆర్ నివాళులు 1
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, తాత ఎన్టీ రామారావుకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 2
నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన తాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ ఇలా..

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 3
ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి దర్శకుడు కొరటాల శివతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 4
తాత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ తన రాజకీయ రంగ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 5
ఎన్టీ రామారావు వారసత్వాన్ని సినిమాల్లో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇలా..

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 6
ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ ఇలా కనిపించారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 7
జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో కలిసి ఇలా మౌనంగా కూర్చున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాళులు 8
తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.
కాగా, హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు మీద భారీగా జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు వెలిశాయి. సిటీవైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు మీద ఈ బ్యానర్లు వెలిశాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి హీరో బాలకృష్ణ బ్యానర్లు, కటౌట్ల కన్నా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు వెలిశాయి. రాజకీయాల్లోకి రావడానికి తనకు ఇంకా సమయం ఉందని, సినిమాల్లో తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి, బాలకృష్ణకు దూరమయ్యారని, ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా దూరమైనట్లేనని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు జూనియర్ ఎన్టీఆర్ తెర దించుతూ ఎన్టీఆర్ వర్ధంతి రోజు మాట్లాడారు.












Click it and Unblock the Notifications