వంశీ, నానిల స్వార్థం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడారు..

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని విడాడని టీడీపీ సినియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. వాళ్ల ఇద్దరి టికెట్స్ కోసం ఎన్టీఆర్‌ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక పార్టీని విడిన దేవినేని అవినాష్‌ది నిలకడ లేని రాజకీయమని విమర్శించారు. వైసీపీ అధికారం పోయిన వెంటనే తిరిగి టీడీపీలోకి వస్తాడని అన్నారు.

ఏపీ రాజకీయాల్లోకి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనను కొడాలి నానీ, వంశీలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే... జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలో ఎదగనీయకుండా... లోకేష్ కోసమే ఆయనకు చెక్ పెట్టారని చేసిన ఆరోపణలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు. వారి స్వార్థం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకున్నారని ఆరోపణలు చేశారు. ఇద్దరి సీట్ల కోసమే ఆయన్ను వాడుకున్నారని అన్నాడు. ఇక వారివల్లే ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారని అన్నారు.

 Jr. NTR have left TDP because of the Minister Kodali Nani and MLA Vamsi

ఇక రాజకీయా అవసరాల కోసమే వంశీ పార్టీ మారరని ఆయన విమర్శించారు. చంద్రబాబు వంశీకి రెండుసార్లు ఎంపీ ,ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వంశీ మాట్లాడుతున్న మాటలు ఆరోజు ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కోసమే వంశీతో పాటు అవినాష్‌లు పార్టీ మారారని ఆయన ఆరోపించారు. వాళ్లు ఎటు అధికారం ఉంటే అటువైపుకు వెళతారని దుయ్యబట్టారు. టీడీపీలో గెలిచిన నాని వైసీపీలో చేరలేదా అంటూ ప్రశ్నించారు. నాని చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలకు వెళ్లే అన్యమతస్తులు ఎవరైన డిక్లేరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+