వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు తోడు: ప్రచారానికి జూ.ఎన్టీఆర్ రెడీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపి కూటమికి ఎన్నికల ప్రచారం చేసేందుకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఆయన కూడా ప్రచార రంగంలోకి దిగుతారని అంటున్నారు. తెలుగుదేశం, బిజెపికి ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఇద్దరు కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

తాను ప్రచారం చేసే విషయంపై జూనియర్ ఎన్టీఆర్ గురువారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి-బిజెపిలకు స్టార్ క్యాంపైనర్‌గా ఉంటానంటూ చెప్పిన న కొద్ది గంటలలోనే జూ. ఎన్టీఆర్ టిడిపి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Jr NTR may campaign for BJP and TDP

2009లో జూ. ఎన్టీఆర్ టిడిపి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున ఏయే నియోజక వర్గాల్లో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారు, రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలన్న అంశంపై రేపే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమని బాబాయ్ బాలయ్య తన ఉత్తరాంధ్ర పర్యటనలో చెప్పిన విషయం తెలిసిందే. ఎవరినీ ప్రత్యేకంగా పిలువాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా, తన అభిమానులూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులూ వేర్వేరుగా లేరని కూడా ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలోకి దిగితే సీమాంధ్ర ఎన్నికలు మరింత రక్తి కడుతాయి.

English summary
It is said that Nandamuri Jr NTR has prepared to campaign for BJP and TDP alliance in Andhra Pradesh election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X