కోలుకున్నాక మళ్లీ కలుస్తా: చిన్నారితో జూ. ఎన్టీఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి పరామర్శించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారి తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను చూడాలని ఆశ పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆ ట్విట్టర్ సందేశాన్ని చూసిన ఎన్టీఆర్.. చిన్నారిని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ, క్రాంతి కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీనిధి(10) గత మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది.
ఆ బాలిక కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక అనారోగ్య పరిస్థితి, జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలన్న ఆమె కోరికను తల్లిదండ్రులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన ఎన్టీఆర్ మంగళవారం ఆస్పత్రికి వచ్చి బాలికను పరామర్శించారు.
త్వరలోనే కోలుకుంటావని, అప్పుడు మళ్లీ వచ్చి కలుస్తానని ఆమెకు ఎన్టీఆర్ చెప్పారు. తమ కూతురు కోరిక మేరకు ఇక్కడకు వచ్చి కలిసినందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సినీ నటులు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు కూడా వారిని కలవాలని కోరుకున్న చిన్నారులను కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి పరామర్శించారు.

ఎన్టీఆర్ పరామర్శ
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారి తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను చూడాలని ఆశ పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఎన్టీఆర్ పరామర్శ
ఆ ట్విట్టర్ సందేశాన్ని చూసిన ఎన్టీఆర్.. చిన్నారిని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

ఎన్టీఆర్ పరామర్శ
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ, క్రాంతి కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీనిధి(10) గత మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది.

ఎన్టీఆర్ పరామర్శ
ఆ బాలిక కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఎన్టీఆర్ పరామర్శ
బాలిక అనారోగ్య పరిస్థితి, జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలన్న ఆమె కోరికను తల్లిదండ్రులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన ఎన్టీఆర్ మంగళవారం ఆస్పత్రికి వచ్చి బాలికను పరామర్శించారు.

ఎన్టీఆర్ పరామర్శ
త్వరలోనే కోలుకుంటావని, అప్పుడు మళ్లీ వచ్చి కలుస్తానని ఆమెకు ఎన్టీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications