పొలిటిక్స్: బాలయ్య కించపరిస్తే, చిరును జూ. ఎన్టీఆర్ ప్రశంసించారు
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని జూనియర్ ఎన్టీఆర్ తెగ ప్రశంసిస్తున్నారని వినికిడి. చిరంజీవిని అవమానిస్తూ బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఆ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ సినిమా సర్దార్ భగత్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆదివారంనాడు చిరంజీవి చెప్పిన మాటలు జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చాయని అంటున్నారు.
సినిమా పరిశ్రమలో రికార్డులు బద్దలువుతూనే ఉండాలని, హీరోలందరి సినిమాలు రికార్డులు సృష్టించాలని, ఈ విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటే తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుతుందని చిరంజీవి అన్నారు. ఈ మాటలు జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చాయని అంటున్నారు.

చిరంజీవి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని చాలా మందికి నచ్చాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా చెబుకుంటున్నారు. హిందూపురం లేపాక్షి నంది ఉత్సవాలకు ఆహ్వానించే విషయంలో చిరంజీవిని కించపరిచే విధంగా బాలకృష్ణ మాట్లాడిన విషయం తెలిసిందే. చిరంజీవిని అహ్వానిస్తారా అంటే తను ఎవరినీ తలకెక్కించుకోనని ఆయన అన్నారు.
చిరంజీవి ప్రసంగాన్ని అభినందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఆయనను పొగిడేసినట్లు చెబుతున్నారు. బాలకృష్ణకు దూరమైన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించకుంది. చాలా కాలంగా బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications