ఏర్ పోర్ట్‌లో నిరీక్షించి.. బాలయ్యకు జూ ఎన్టీఆర్ వెల్‌కం!
విజయవాడ/గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ... కార్యక్రమానికి హాజరయ్యేందుకు గన్నవరం చేరుకున్న హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వాగతం పలికారు.
బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పలువురు వచ్చారు. వారికి అప్పటికే గన్నవరం చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రాం, నారా రోహిత్‌లు స్వాగతం పలికారు. వీరు ముగ్గురు విమానాశ్రయంలో మూడు గంటల పాటు నిరీక్షించారు.

సహకారం ఉంటుంది: మోడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, మంత్రులు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి పాటుపడాలని కోరుకుంటున్నానన్నారు. చంద్రబాబు పట్టుదల, కార్యదక్షత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆభివృద్ధి చెందేందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని కేంద్రం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
పిలిచారని వివేక్ ఒబేరాయ్
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించారన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పరిటాల సునీతకు కూడా అభినందనలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం కోసం ముంబై నుంచి వివేక్ వచ్చారు.












Click it and Unblock the Notifications