బాబు ప్రమాణానికి తండ్రితో కల్సి జూఎన్టీఆర్: జగన్ నో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు రానున్నారు. హరికృష్ణ, ఆయన తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రమాణ స్వీకారానుకి రానున్నారు.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు వస్తారని టిడిపి రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనే చర్చ సాగింది.

అయితే హరి, కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు రానున్నారు. మిగతా నందమూరి కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా వస్తారని టిడిపి తెలిపింది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
బాబు హామీ నెరవేరుస్తారు: రాయపాటి
చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు శనివారం అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆదివారం సాయంత్రం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతు, డ్రాక్రా రుణమాఫీల పైన మొదటి సంతకం చేస్తారని చెప్పారు. తెరాసలా ప్రజలను తాము మోసం చేయమని చెప్పారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications