జూనియర్ ఎన్టీఆర్‌‌ను బావా అంటూ పిలిచిన అల్లు అర్జున్: జెన్యూన్‌గా విషెస్

న్యూఢిల్లీ/అమరావతి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో చూపిన నటనకు ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ సినిమాలో గంధపు చెక్కల వర్కర్‌గా, స్మగ్లర్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు. తగ్గేదే లే.. అనే మేనరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు అల్లు అర్జున్. తెలుగులో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న తొలి హీరో కూడా అతనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉంటోన్నారు.

Pushpa 2 Allu Arjun

అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం పట్ల టాలీవుడ్ స్పందిస్తోంది. ఆయనను అభినందిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్ చేస్తోన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు. నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చాలామంది సినీ పెద్దలు అల్లుకు విషెస్ తెలియజేస్తోన్నారు.

అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ బంగళా బ్లెస్సింగ్స్ వద్ద కూడా సందడి నెలకొంది. ఆయనకు అవార్డ్ వచ్చిందనే విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటోన్నారు. బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొంటోన్నారు. పుష్ప బ్యానర్లను ప్రదర్శిస్తోన్నారు.

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ బావా, పుష్ప ఘన విజయం సాధించడంలో, అవార్డులను సాధించడంలో అన్ని అర్హతలు ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

NTR Allu Arjun

దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ జెన్యూన్ విషెస్ బావా అంటూ సంబోధిస్తూ రిప్లై ట్వీట్ పోస్ట్ చేశారు. ఇక్కడ జెన్యూన్ అనే పదాన్ని వాడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్‌లో నటనకు గాను జూనియర్‌కు ఈ అవార్డు వస్తుందని మొదట అంచనాలు ఏర్పడ్డాయి.

ఎన్టీఆర్‌కు కాకుండా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం కొంతవరకు ఆశ్చర్యపరిచిందనే వాదనలు లేకపోలేదు. తనకు రాకపోయినప్పటికీ.. ఎన్టీఆర్ జెన్యూన్‌గా స్పందించారనే అర్థం వచ్చేలా అల్లు అర్జున్ ఈ పదాన్ని వాడారని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ మినీ డిబేట్ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+