జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా, స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నవారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, ఏదైనా.. టాలెంట్ వల్లే అత్యున్నతస్థాయికి చేరుకోలేరు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టం తారక్ కు తోడైంది. నందమూరి వారసుడిగా రంగప్రవేశం చేసిన జూనియర్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరో స్థాయికి ఎదిగాడు.

ఆయనకు ఉన్న అభిమానుల బలం చూస్తే రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని అందరూ భావిస్తుంటారు. జూనియర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అభిమానులంతా సీఎం, సీఎం అంటూ కేకలు వేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

 ntr

తారక్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలంటూ అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకం ప్రకారం తన రాజకీయ జీవితం గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. తారక్ జాతం చూసిన పలువురు జ్యోతిష్యులు రాజకీయాల్లోకి అడుగు పెడితే సంచలనాలు సృష్టిస్తారని, అంతే కాకుండా కొద్దిగా శ్రమపడితే ప్రధానమంత్రి అయ్యే యోగం పుష్కలంగా ఉందని చెప్పారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ దేవర చిత్రం చేస్తున్నారు. అందులో జాన్వీకపూర్ కథానాయిక కాగా, ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొరటాల పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+