నటిని చేస్తానని గర్భవతిని చేశాడు: వలలో ఎలా (ఫోటో)
హైదరాబాద్: సినిమాల్లో అవకాశం కల్పిస్తానని ఓ యువతిని నమ్మించి ఐదు లక్షల రూపాయలు తీసుకోవడమే కాకుండా, గర్భవతిని చేసిన జూనియర్ ఆర్టిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మోసపోయిన బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జూనియర్ ఆర్టిస్టు చాంద్ పాషానుఅదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన చాంద్ పాషా(28) ఉప్పల్ విజయపురి కాలనీలో ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ పత్రికలో జూనియర్ ఆర్టిస్ట్‌లు కావాలని ప్రకటనలు ఇచ్చాడు. ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఓ యువతి (19) ఈ ప్రకటనలు చూసి నగరానికి వచ్చింది.

తనకు జూనియర్ ఆర్టిస్ట్‌గా అవకాశం కల్పించాలని కోరింది. దీంతో అతను అంచెలంచెలుగా దాదాపు రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఆమెతో చనువుగా ఉంటూ ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఐదు నెలల గర్భవతిని చేశాడు. ఉప్పల్ చిలుకానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆమెను అక్కడ ఉంచాడు.
నెలలు గడుస్తున్నా పెళ్లి చేసుకోవడం లేదు. అడిగితే బెదిరించడం మొదలెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె శనివారం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చాంద్‌పాషను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతనిపై 376, 417, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బాధితురాలు లవ్ సిలబస్ షార్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేసినట్లుగా తెలుస్తోంది.
-
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications