సహజీవనం, పెళ్లికి లవర్ నో: జూ.ఆర్టిస్ట్ సూసైడ్‌యత్నం

హైదరాబాద్: గతంలో రెండు వివాహాలు చేసుకున్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుని నమ్మించి సహజీవనం కొనసాగించి మోసగించాడు. మనస్తాపం చెందిన ఆ బాధితురాలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ముందే శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

రెండు రోజుల క్రితం హైదరాబాదులో ఓ టీవీ యాంకర్.. తన ప్రియుడు ఇన్నాళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధపడ్డాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో జూనియర్ ఆర్టిస్టు మోసగించబడింది.

Junior Artist tries to commit suicide

ఇందిరానగర్‌లో నివసించే ఓ యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన నవీన్‌తో పరిచయమైంది. పెళ్ళి చేసుకుంటానని ఆమెను నమ్మించిన నవీన్ రెండేళ్ళుగా సహజీవనం చేస్తున్నాడు. రెండుసార్లు ఆమెను గర్భవతిని చేసి గర్భస్రావం చేయించాడు.

పెళ్లి చేసుకోమని ఆమె కోరడంతో అతను అంగీకరించలేదు. అంతేకాదు పారిపోయాడు. జరిగిన మోసం గ్రహించిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నవీన్‌కు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయని, ప్రస్తుతం రెండో భార్యతో ఉంటున్నాడని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు శనివారం నిందితుడిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. జూనియర్ ఆర్టిస్టును పెళ్లి చేసుకోనని విచారణలో చెప్పాడని సమాచారం. ఇది విన్న బాధితురాలు మనస్తాపానికి గురై శనివారం రాత్రి పోలీసు స్టేషన్ బయటకు వచ్చి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+