నిర్మాతగా మారుతున్న Jr. NTR.. టాప్ హీరోతో మూవీ?
RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్ (junior ntr) గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తాను తర్వాత చేయబోయే సినిమాలన్నింటినీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా ఉండేటట్లు చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలకు మధ్యలో ఉన్న సమయాన్ని వార్ కు కేటాయించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నారు. తారక్ ఇలా తన ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూనే నిర్మాతగా (producer)మారబోతున్నారు. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తన మొదటి సినిమాగా నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నారు.
కొత్త బ్యానర్ పై నిర్మించే చిత్రానికి సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ తో కలవనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుపై కల్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్నారు. నాని హీరోగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా తమ మొదటి సినిమాను నిర్మిస్తున్నారంటూ తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్ చల్ చేస్తోంది. బ్యానర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. యువకులను, కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో జూనియర్ దీన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన టాప్ హీరోలంతా సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని, కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్, యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్, ఏఎంబీ పై మహేష్ బాబు, గీతా ఆర్ట్స్ పై అల్లు అర్జున్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి కొత్తగా మరో బ్యానర్ ఏర్పాటు చేశాడు. తాజాగా వీరి జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరబోతున్నారు.












Click it and Unblock the Notifications