కుప్పం వేదికగా జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కీలక నిర్ణయం - టీడీపీలో టెన్షన్..!?

కుప్పం వేదికగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సమావేశం కానున్నారు. కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. అటు జనసేనతో పొత్తు.. ఇటు లోకేష్ పాదయాత్ర వేళ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రోల్ పైన చర్చ మొదలైంది. కొంత కాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీలోని కొందరు జూ ఎన్టీఆర్ పైన విమర్శలు చేసారు. ఇది జూ ఎన్టీఆర్ అభిమానులకు రుచించ లేదు. చంద్రబాబు పర్యటనల్లోనూ జూఎన్టీఆర్ ఫొటోలతో జెండాలు..అభిమానుల నినాదాలు హోరెత్తాయి. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సమావేశం ఖరారు అయింది. అందునా కుప్పం వేదికగా ఈ భేటీ జరగనుంది..కీలక నిర్ణయం దిశగా సమావేశం అవుతున్నారని సమాచారం. ఇదే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.

జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్...

జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్...


జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రేపు (ఆదివారం) లో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా కుప్పంలో ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమావేశం పైన ఆసక్తి పెరుగుతోంది. ఈ సమావేశంలో అభిమానులు ఏ తీర్మానం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. ఆ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా కీలక నిర్ణయం ప్రకటన దిశగానే ఈ సమావేశం జరుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి. గతంలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలోనే జూ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకు మద్దతుగా నినాదాలు చేసారు. జూ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్ చేసారు. ఆ తరువాత రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే రకమైన డిమాండ్లు వినిపించాయి. కానీ, చంద్రబాబు స్పందించలేదు. ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఈ సమావేశంలో రాజకీయంగానే చర్చ ఉంటుందనే అభిప్రాయం బలపడుతోంది.

జనసేన పొత్తు - లోకేష్ పాదయాత్ర వేళ

జనసేన పొత్తు - లోకేష్ పాదయాత్ర వేళ

టీడీపీ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందు కోసం ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో 2014 తరహా పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయమైందని ప్రచారం సాగుతోంది. టీడీపీ - జనసేన నేతలు ఈ మేరకు సిద్దపడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ కుప్పం నుంచి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అదే కుప్పం వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ మీట్ అవుతున్నారు. కొద్ది నెలల క్రితం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీటి పర్యంతం..అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పైన టీడీపీ శ్రేణులు కొన్ని విమర్శలు చేసారు. వీటిని జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. టీడీపీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో జూ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ లో గోరంట్ల బుచయ్య చౌదరి లాంటి వారు గతంలోనే తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. టీడీపీలోని జూ ఎన్టీఆర్ అభిమానులు అదే కోరుకుంటున్నారు.
అభిమానుల నిర్ణయం పై ఉత్కంఠ..

అభిమానుల నిర్ణయం పై ఉత్కంఠ..


హైదరాబాద్ వేదికగా కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా - జూ ఎన్టీఆర్ భేటీ జరిగింది. ఆ సమావేశం రాజకీయంగా ఉత్కంఠను పెంచింది. కానీ, ఆ భేటీ రాజకీయంగానే జరిగిందని బీజేపీ నేతలు చెప్పినా..ఏం జరిగిందనేది మాత్రం స్పష్టత లేదు. ఇక...హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలోనూ..జూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ టీడీపీ శ్రేణులను నచ్చలేదు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా జూ ఎన్టీఆర్ ప్రచారం చేసారు. ఆ తరువాత క్రమేణా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాల వైపే ఫోకస్ చేసిన జూ ఎన్టీఆర్ రాజకీయంగా ఇప్పటిల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుప్పం వేదికగా నిర్వహిస్తున్న ఈ మీట్ - గ్రీట్ భేటీ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+