వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం?

ఏపీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13వ తేదీన అసెంబ్లీకి, లోక్ సభకు ఓకేవిడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకొని తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ఎన్డీయే మద్దతు కావాలనేది చంద్రబాబు యోచనగా ఉంది. అందుకనుగుణంగా ఆయన వ్యూహాలు రచించుకుంటున్నారు. ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబుతున్నారు? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తోపాటు నందమూరి బాలకృష్ణతో తారక్ కు సన్నిహిత సంబంధాలు లేవు. గతంలో ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల మళ్లీ వీరిమధ్య దూరం పెరిగింది. దివంగత నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులందరితో సంబంధాలు క్రమేపీ తగ్గుతున్నాయి. తన సోదరుడు కల్యాణ్ రామ్ తోపాటు మరో ఇద్దరితో మాత్రమే తారక్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. చివరగా 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసి దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రసంగాలిచ్చారు. ఆ తర్వాత పార్టీకి, తారక్ కు దూరం పెరిగింది.

junior ntr key decission on ap elections

హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో కూడా సోదరికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. ఇటీవలే డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కల్యాణ్ రామ్ ను ఏపీ ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని విలేకరులు ప్రశ్నించగా తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంటే తారక్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కల్యాణ్ రామ్ చెప్పారు.

కుటుంబం అంటే కేవలం తాను, తారక్ మాత్రమే మిగిలాననేది కల్యాణ్ రామ్ ఉద్దేశం. నందమూరి కుటుంబం అంటే పదుల సంఖ్యలో ఉంటారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తారక్ కానీ, కల్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. అప్పటికి అంతంతమాత్రంగానే ఉన్న సంబంధాలు అరెస్ట్ తర్వాత స్పందించకపోవడంతో మరింత క్షీణించాయి. దగ్గుబాటి కుటుంబం కూడా చంద్రబాబుకు దగ్గరవుతోంది. రేపటి ఎన్నికల్లో కూడా తారక్ సైలెంట్ గానే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు తారక్, కల్యాణ్ రామ్ మాత్రమే మిగులుతున్నారని, వీరు కేవలం సినిమాలవైపే దృష్టిసారిస్తారంటున్నారు. ఒకరకంగా ఈ ఎన్నికల్లో కూడా తారక్ చంద్రబాబుకు దూరం జరిగినట్లేనంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+