జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఘన విజయాలను అందించారు. తన కెరీర్ లోనే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇటీవలే RRR చిత్రంతో గ్లోబల్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.
ముందుగా దర్శకులు ఒక కథ అనుకున్న తర్వాత దానికి తగ్గ హీరో కోసం వెతుకుతారు. ఇలా మన తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో దర్శకులు ముందుగా కథ అనుకొని దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించేవారు. వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్లకానీ, కథ నచ్చకపోవడంవల్ల కానీ, మరే ఇతర కారణాలవల్లకానీ కొన్ని కొన్ని సినిమాలు చేయలేకపోయేవారు. ఈ కోవలో జూనియర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించి ఘన విజయం సాధించిన చిత్రం కిక్ . దర్శకుడు ఈ సినిమాను ముందుగా తారక్ కే వినిపించారు. అయితే కామెడీ టైమింగ్ ఎక్కువగా ఉండటంతో జూనియర్ రిజెక్ట్ చేశాడు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా కూడా ముందుగా జూనియర్ దగ్గరకు చేరింది. అప్పటికే కొన్ని ప్రేమ కథాచిత్రాల్లో నటించి ఉండటంతో జూనియర్ దాన్ని కూడా వద్దనుకున్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సినిమా దిల్. ఈ సినిమాలో మాస్ పాత్రలు ఎక్కువగా ఉండటంతో తారక్ రిజెక్ట్ చేశారు. రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భద్ర సినిమా ఘనవిజయాన్ని సాధించింది. బోయపాటి ముందుగా ఈ సినిమాను జూనియర్ కే వినిపించాడు. డేట్స్ ఖాళీ లేకపోవడంతో దీన్ని వద్దనుకున్నాడు. ఇవే కాకుండా ఊపిరి, ఎవడు, అతనొక్కడే, కృష్ణ సినిమాలను కూడా తారక్ రిజెక్ట్ చేశాడు. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం విశేషం.












Click it and Unblock the Notifications