లోకేష్ పాదయాత్ర - జూనియర్ ఎన్టీఆర్
యాత్ర ప్రారంభం నుంచి జరుగుతున్నంత వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగానే పాదయాత్ర నడుస్తోంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 27వ తేదీన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఈ యాత్ర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా..
యాత్ర ప్రారంభం నుంచి జరుగుతున్నంత వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగానే పాదయాత్ర నడుస్తోంది. తిరుపతిలో హలో లోకేష్ పేరుతో కార్యక్రమం జరిగింది. అందులో యువత అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని నన్ను అడిగారు. నూటికి నూరుశాతం ఆహ్వానిస్తామన్నారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు కోరుకొంటున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి? ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో వారంతా రాజకీయాల్లోకి రావాలన్నారు.

పీలేరు పరిధిలో ఫ్లెక్సీల ఏర్పాటు
యాత్ర పొడవునా ఏదో ఒక మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి జూనియర్ ఎన్టీఆర్ పదవులు చేపట్టాలని, పార్టీని అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా పాదయాత్ర జరుగుతోన్న పీలేరు నియోజకవర్గ పరిధిలో కూడా పార్టీ కోసం ఎన్టీఆర్ రావాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అన్న పెట్టిన పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని ఆయా ఫ్లెక్సీలో రాసివుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వాటన్నింటినీ తొలగించుకుంటూ వచ్చారు.

పాజిటివ్ గా స్పందిస్తోన్న లోకేష్
ఎక్కడ వాహనాన్ని ఆపి మాట్లాడుతున్నా, ఎక్కడ సభ నిర్వహిస్తున్నా, ఎక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటున్నా, ఎక్కడ ప్రసంగిస్తున్నా.. లోకేష్ కు అన్నిచోట్ల నుంచి ఒకే ఒక ప్రశ్న ఎదురవుతోంది. జూనియర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? అని. అయితే లోకేష్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో సహా అందరినీ ఆహ్వానిస్తున్నామంటున్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ అతని ఈ తరుణంలో రాజకీయాలవైపు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదనేది రాజకీయ విశ్లేషకుల భావన.












Click it and Unblock the Notifications