‘బావా.. పార్టీ లేదా?’.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ల మధ్య సరదా సరదాగా ఓ సంభాషణ జరిగింది. వీళ్లద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 'బావ' అనే పదం ట్విటర్ ట్రెండింగ్‌లోకి చేరింది.
అల్లు అర్జున్ శనివారం తన 41వ పుట్టిన రోజును జరుపుకున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బన్నీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

'హ్యాపీ బర్త్‌డే బావ.. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా' అని తారక్ ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. 'నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా.. నీకు నా హగ్స్..'' అని సమాధానమిచ్చారు. దీనిపై ఎన్టీఆర్ .. 'కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?' ('పుష్ప' సినిమాలోని డైలాగ్) అంటూ స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు.
దీనికి బన్నీ.. 'వస్తున్నా' (NTR 30 చిత్రంలోని డైలాగ్) అని కన్నుగీటారు. ఇలా.. తారక్, బన్నీ తమ క్రేజీ ప్రాజెక్ట్‌లోని స్పెషల్ డైలాగ్స్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసుకున్నారు. వీటిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2' కోసం పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈసినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications