ఆ సమయంలో తారకరత్నకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా నటించారు.

నందమూరి తారకరత్న 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. ఆయన అకాల మరణం నందమూరి అభిమానులను కలిచివేసింది. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన ఎంట్రీనే ఒక సంచలనంగా మారింది.

ఒకేరోజు 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఏ హీరోకి సాధ్యం కాలేదు. 2002లో 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో రంగప్రవేశం చేశారు. ఆ సినిమా విజయవంతంగా ఆడింది. తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న లాంటి సినిమాలన్నీ విడుదలవగా కొన్ని పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయాయి. ఒకటో నెంబరు కుర్రాడు సినిమా తర్వాత తారకరత్న నటించిన సినిమాలన్నీ పరాజయాన్ని చవిచూశాయి.

Nandamuri Tarakaratna fought with death for 23 days and lost.

తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో నటనకు నంది అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత తారకరత్నకు అవకాశాలు రాలేదు. ఆయన ఫ్యామిలీకి ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరమయ్యారు. ఆ సమయంలోనే తారకరత్న చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనీసం తన పిల్లల అవసరాలు కూడా తీర్చలేకపోయే స్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఎవరికీ తెలియకుండా నెలకు రూ.4 లక్షలు పంపిస్తున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో తారకరత్న మాట్లాడుతూ తన కుటుంబం ఇలా నిలబడటానికి కారణం ఎన్టీఆర్ అని.. తన తమ్ముడు లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని, నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన తమ్ముడు తనకు అండగా నిలబడి రక్షించాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+