జగన్! మీకు నచ్చినట్లు ఉండలేకపోతున్నా: వైసిపికి నెహ్రూ రాజీనామా

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం నాడు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా జగన్‌కు ఆయన చురకలు అంటించారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నానని ఎద్దేవా చేశారు.

జగన్‌కు పంపిన లేఖలో.. మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ రాజీనామాతో గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. వైసిపికి రాజీనామా నేపథ్యంలో ఆయన ఇక ఎప్పుడైనా టిడిపిలో చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Jyothula Nehru resigns YSR Congress Party

నెహ్రూ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార ప్రతినిధి, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, జిల్లా పార్టీ అధ్యక్ష.. తదితర పదవులు అన్నింటి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లేఖను తాను పార్టీ కార్యాలయానికి పంపించినట్లు చెప్పారు.

రాజీనామా లేఖ అందలేదు: పార్టీ కార్యాలయం

అయితే, తమకు జ్యోతుల నెహ్రూ రాజీనామా లేఖ రాలేదని వైసిపి చెబుతోంది. సాయంత్రం వరకు రాజీనామా లేఖ రావొచ్చునని చెబుతున్నారు.

కృతజ్ఞత లేకుండా పోయింది: వైసిపి ఆగ్రహం

వైయస్ జగన్.. నెహ్రూకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ఆయన మాత్రం జగన్ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని వైసిపి నేతలు ధ్వజమెత్తారు. జగన్ ఆదరించిన వారే పార్టీనీ విడి వెళ్తుండటం బాధాకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+