పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్.. దశావతారాలు ఎత్తుతాడు; చిరంజీవి నయం: కేఏ పాల్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన సంచలన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని, ఆయన దశావతారాలు ఎత్తటాన్ని ప్రజలు చూస్తున్నారంటూ కె ఏ పాల్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎనౌన్స్ మెంట్ చూసిన తర్వాత జనాలు షాక్ అయి ఉండొచ్చు కానీ తాను షాక్ కాలేదని కె ఏ పాల్ పేర్కొన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వకుండా బీజేపీ నష్టం చేసిందని పేర్కొన్నారు.

KA paul sensation: pawan kalyan is a package star,chiranjeevi is better than him

4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను నాలుగు వేల కోట్లకు ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుంటే తాను ఆపానని కె ఏ పాల్ తెలిపారు. రాష్ట్రాన్ని నరేంద్రమోడీ నాశనం చేస్తే, రాష్ట్రంలో ఓటు బ్యాంకు చీలకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవన్నీ బిజెపి బీ పార్టీలే అని పేర్కొన్నారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారని, ఆపై 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కేంద్రమంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే చిరంజీవి ఉన్నారని పేర్కొన్నారు కే ఏ పాల్. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదన్నారు. ఆయనకు నిలకడ లేదన్నారు.

2014 లో టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదని, 2019లో వాటిని వ్యతిరేకించి సిపిఐ, సిపిఎం, బీఎస్పీ ల తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసి, కనీసం పోటీ చేసిన చోట పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ టీడీపీతో, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళతామని చెప్పడం దశావతారాలు కాకపోతే మరి ఏమిటని ప్రశ్నించారు.

కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్లు రాకముందే పది పార్టీలు మారారని ఎద్దేవా చేశారు . చంద్రబాబు బిజెపి బీ పార్టీ గా మారి, పవన్ కళ్యాణ్ ద్వారా డ్రామాలు ఆడుతూ ఇదంతా చేస్తున్నారని కే ఏ పాల్ పేర్కొన్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ బిజెపి బి పార్టీ లేనని, కేవలం ప్రజాశాంతి పార్టీ బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ అని కే ఏ పాల్ అన్నారు. అందరూ ప్రజాశాంతి పార్టీ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+