జగన్ ఇలాకాలో బాబుకు రివర్స్: లోకేష్ తీసుకొస్తే, అలా వైసిపిలోకి జంప్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాక్ తగిలింది.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాక్ తగిలింది. ఇటీవల పలువురు జిల్లా నేతలు టిడిపిలో చేరారు.
అలాగే నీటిని అందించడం ద్వారా కడప జిల్లాలో పట్టు కోసం తెలుగుదేశం ప్రయత్నాలు సాగించింది. అయితే, అనూహ్యంగా శుక్రవారం చంద్రబాబుకు షాక్ తగిలింది.

గతంలో వైసిపి నుంచి టిడిపిలో చేరిన కడప నగర పాలక సంస్థలోని కొందరు కార్పోరేటర్లు తిరిగి జగన్ పార్టీలోకి చేరారు. ఈ రోజు(గురువారం) జగన్ వచ్చారు. జగన్ సమక్షంలో వారు తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పన్నెండు మంది కార్పోరేటర్లు విడతల వారీగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. వారిలో ఇద్దరు ముగ్గురు ఇప్పటికే వైసిపిలో చేరారు. ప్రస్తుతం అదే బాటలో మరో ఐదారుగురు చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications