కడప విద్యార్థికి గూగుల్ రూ.2 లక్షల రివార్డ్...లోపం కనుక్కున్నాడని!
కడప:గూగుల్ పేరు తెలీని టెక్కీలు...ఆ పదం వినని సామాన్యులే ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి అన్నింటికంటే బాగా ప్రాచుర్యం పొందింది సెర్చి ఇంజన్ విభాగంలో...
అందరికీ అన్నింటి గురించి వెతికిపెట్టే ఈ జగత్ విఖ్యాతి సంస్థకు సంబంధించి...ఓ లోపాన్ని కనుగొనడం ద్వారా గూగుల్ నే ఖంగుతినిపించాడో విద్యార్థి. కడపలో ఇంజినీరింగ్ చదువుతున్న ఈ కుర్రాడి టాలెంట్ కు అబ్బురపడిన గూగుల్ ఆ కుర్రాడికి ఊహించని బహుమతి ఇచ్చి సత్కరించింది. కారణం ప్రపంచంలోనే మేటి అనదగ్గ ఐటి నిపుణులను ఏరి కోరి ఎంపిక చేసుకునే ఈ సంస్థ అత్యుత్తమ ప్రతిభావంతులైన ఉద్యోగులు కలిగిన కంపెనీగా కూడా విశేషంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అంతటి మహామహులు కనిపెట్టలేని ఒక ప్రత్యేకమైన లోపాన్ని ఈ విద్యార్థి కనుగొనడమే గూగుల్ యాజమాన్యం స్పందనకు కారణం.

కడపకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోపాల్‌సింగ్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఓ లోపం గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని గూగుల్ సంస్థకు తెలియజేశాడు. తమ తప్పును గురించి తెలుసుకున్న గూగుల్ దాన్ని సరిదిద్దుకోవడంతో సరిపెట్టేయలేదు. తమ తప్పు గురించి తమకు వెంటనే తెలియజేసిన విద్యార్థి ఎవరో తెలుసుకొని అతడికి 3133.70 డాలర్లు(రూ. 2.10 లక్షలు) ప్రైజ్ మనీ ప్రకటించింది.
అంతేకాదు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఆ విద్యార్థిని గూగుల్ ప్రతినిధులు ఆ విద్యార్థి గోపాల్ సింగ్ ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి గోపాల్ సింగ్ మాట్లాడుతూ గూగుల్ లో ఒక లోపం ఉందని, ఆ లోపం ద్వారా ప్రత్యర్థి కంపెనీలు గూగుల్‌తో పాటు ఆ సంస్థతో టైఅప్ అయిన కంపెనీల రహస్యాలను చౌర్యం చేసే ప్రమాదం ఉందని చెప్పారు. దాన్నే తాను గుర్తించి గూగుల్‌కు తెలియజేసినట్లు గోపాల్‌సింగ్ వెల్లడించారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications