ఏపీలో ఎన్నికల కమిషన్ సంచలనం... కీలక నేత నామినేషన్ తిరస్కరణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయగా అధికారులు దాన్ని తిరస్కరించారు. ఈ స్థానానికి మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా 18 మందివి ఆమోదించారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత శివశంకర్ రెడ్డి ప్రమాణ పత్రం దాఖలు చేసి ఆర్వో ఎదుట దాన్ని చదవాలి. శివశంకర్ రెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలై హైదరాబాద్ లో ఉంటున్నారు. అతడి తరఫున ఈనెల 18వ తేదీన విద్యాధర్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడు. వాటిని పరిశీలించగా ప్రమాణ పత్రం లేనట్లు గుర్తించి దాన్ని అధికారులు తిరస్కరించారు.

kadapa lok sabha independent candidate devireddy siva sankar reddy nomination rejected

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాపట్ల జిల్లా చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్ పై నిర్ణయాన్ని ఆర్వో పెండింగ్ లో పెట్టారు. అతను రూ.4.63 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ ఆర్వోకు ఫిర్యాదు అందించింది. శనివారం ఉదయానికల్లా విద్యుత్యు బిల్లుల చెల్లింపుతోపాటు పూర్తి వివరాలను, పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నామినేషన్ పత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, దాన్ని తిరస్కరించాలంటూ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు ఫిర్యాదు చేశారు.

అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల వవరాలు పొందుపరచలేని అభ్యంతరం తెలపగా అవన్నీ చిన్నవేనంటూ ఆర్వో నామినేషన్ ఆమోదించారు. నెల్లూరులో నామినేషన్లు దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది కూడా తిరస్కరించాలని ప్రత్యర్థి విజయసాయిరెడ్డి కోరగా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అక్కడకు వచ్చి వివరణ ఇవ్వడంతో విజయసాయిరెడ్డి అభ్యంతరాలను ఆర్వో తిరస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+