అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ మరోసారి వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 4.00 గంటలకు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉండగా.. బుధవారం నిర్వహిస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని సీబీఐ కార్యాలయానికి రమ్మంటామని చెప్పింది.

ఇదిలా ఉండగా అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట దొరికింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి ప్రతిరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎంపీ విచారణ ఆడియో, వీడియో చేయాలని, ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు 25వ తేదీన ఇస్తామని కోర్టు తెలిపింది.

 avinashreddy

అవినాష్‌రెడ్డి ముందస్తు బె యిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేచివన్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఎంపీ అనుచరులతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బుధవారం ఉదయం విచారణకు రావాలని సీబీఐ అవినాష్‌రెడ్డికి తెలియజేసింది.

వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కుట్ర అవినాష్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ తరఫు న్యాయవాదులు కోరుకు తెలిపారు. విచారణలో తమకు సహకరించడంలేదని, దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించామని, హత్యకు ముందు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారన్నారు.

హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారో తెలియాల్సి ఉందని, వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు దగ్గరలో ఉన్నట్లు చెప్పారని, కానీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం ఆయన ఇంట్లోనే ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఆ రాత్రంతా ఎంపీ అవినాష్ తన ఫోన్ ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+