YS Avinash Reddy : ముగిసిన అవినాష్ రెడ్డి విచారణ-సీబీఐకి లేఖ-కీలక వ్యాఖ్యలు..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో హైదరాబాద్ లో ఇవాళ రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జోరుగా సాగుతోంది. ఇవాళ మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. అనంతరం వైఎస్ అవినాష్ మీడియాతో మాట్లాడారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. అనంతరం బయటికి వచ్చారు.సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు అవినాష్ తెలిపారు. తాను విజయమ్మ వద్దకు వెళ్ళినప్పుడు బెదిరించి వచ్చానని ప్రచారం చేశారని ఆరోపించారు. దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తాను దుబాయ్ కి వెళ్ళినట్టు కూడా తప్పుడు ప్రచారం చేశారన్నారు.

దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ విచారణ ఎదుర్కొని బయటికి వచ్చిన అవినాష్.. ఈ వ్యవహారంలో మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వంద వరకు పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ ఈసారి తనకు చెప్పలేదన్నారు. తనకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చానన్నారు. తన విజ్ఞాపన పత్రంపై కూలంకషంగా విచారణ చేయాలని కోరానన్నారు.
మరోవైపు వివేకా హత్యకేసులో అవినాష్ పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అవినాష్ ను సమర్ధిస్తూ వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్లు ఇచ్చారు. ఈ కేసులో అవినాష్ పాత్రపై ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని సజ్జల తెలిపారు. అయినా టీడీపీ మాత్రం తాజాగా సీబీఐ నిందితుల బెయి్ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ ఆధారంగా అవినాష్ ను టార్గెట్ చేస్తోంది.












Click it and Unblock the Notifications