రాజీనామా పై తేల్చి చెప్పిన ఆదినారాయణ రెడ్డి, కొత్త కాదు...!!
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే పొలిటికల్ బాంబ్ పేల్చారు. కడప జెడ్పీ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాకు సిద్దపడ్డారు. ఆయన తో పాటుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ఆయన సోదరుల కుమారులు సిద్దమయ్యారు. దీంతో, బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. బుజ్జ గింపులు మొదలు పెట్టారు. అయితే, ఆదినారాయణ రెడ్డి ఈ వ్యవహారం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తన ఎమ్మెల్యే పదవి కొత్త కాదని.. రాత్రికి జరిగే చర్చల తరువాత తన రాజీనామా పైన ప్రకటన చేస్తానని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి అల్టిమేటం జారి చేసారు. తాము చెబుతున్న సమస్యకు పరిష్కారం వస్తుందా లేదా అనేది చూస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ- బీజేపీకి మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని.. రాజకీయ మార్పు చాలా తేలిక అని వ్యాఖ్యానించారు. తన రాజీనామా పైనా ప్రకటన చేస్తానని వెల్లడించారు. తనకు బీజేపీ మద్దతు ఉందని... మంత్రి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఉదయం నుంచి ఆది నారాయణ రెడ్డి రాజీనామా ప్రచారంతో విజయవాడకు చేరుకున్న వారితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటుగా విష్ణు కుమార్ రాజు చర్చించారు. నిర్ణయం పైన మాధవ్ స్పందించారు. ఈ ఏపీలో కూటమిగా మూడు పార్టీలు ఉన్నామని.. మహారాష్ట్ర లో నాలుగు పార్టీలు ఉన్నా..లోకల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారని గుర్తు చేసారు. ఏపీలో కూటమి మూడు పార్టీలు కలిసి పోటీ చేశామని వివరించారు.
ఏపీలో మూడు పార్టీల కూటమి ఒక కుటుంబం లాంటి దని పేర్కొన్నారు. అక్కడక్కడ సమస్యలు వస్తాయని..పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆదినారాయణ రెడ్డిని హ్యాండిల్ చేయడం జగన్ వల్లే కాలేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు కూల్ గా ఉండడం ఉండదు.. ఆయన ఎప్పుడూ ఫైరేనని చెప్పుకొచ్చారు. కాగా, ఈ పరిణామాల పైన జమ్మలమడుగు జెడ్పీటీసీ రాజేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
నేను ZPTC గా ఏకగ్రీవం గా ఎన్నిక అయ్యానని.. జిల్లా పరిషత్ చైర్మన్ బరిలో ఉన్నామని చెప్పారు. కానీ టీడీపీ కి చైర్మన్ పదవి ఇచ్చారని.. తమకు ఇవ్వకుండా టిడిపి కి ఇచ్చారని వ్యాఖ్యానించారు. తమను టీడీపీ పెద్దలు తక్కువ చేసి మాట్లాడా రని.. చిన్న చూపు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనతో పాటుగా తన సోదరుడు కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications
