హఠాత్తుగా వచ్చి ఆశ్చర్యపరిచిన నటి కాజల్ (ఫోటో)
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కాజల్ గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సందడి చేశారు. హైదరాబాదులోని శ్రీనగర్ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో కాజల్ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రూ కాఫీ ప్రమోషన్‌లో భాగంగా గురువారం నాడు ఉదయం పల్లవి ఎస్టేట్ ఎదురుగా రెడ్డి స్టోర్స్‌లో కాజల్ హఠాత్తుగా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

బ్రూ కాఫీ సంస్థ ప్రచారంలో పాల్గొన్న కాజల్ తనను చూసేందుకు వచ్చిన స్థానికులతో మాట్లాడుతూ కాసేపు సందడి చేశారు. కాజల్‌ను చూసేందుకు చాలామంది తరలి వచ్చారు.
కాగా, ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల నటీనటులు, క్రీడాకారులు వినూత్నరీతిలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, శ్రీనగర్ డివిజన్ ఎల్లారెడ్డిగూడలోని రెడ్డి స్టోర్స్‌కు వచ్చిన కాజల్.. స్థానికులకు బ్రూ కాఫీ అంద చేశారు. ఆమెతో చేతులు కలిపేందుకు, ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం కనబరిచారు.












Click it and Unblock the Notifications