మెదక్‌లో కాజల్ ఓటరు, ప్రచారం మాని బిజెపికి బాబు..
హైదరాబాద్/మెదక్: మెదక్ జిల్లాలో ఓటరు నమోదులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయిలో సిని నటీ కాజల్ అగర్వాల్ ఓటరుగా నమోదయ్యారు. జాబితోల ఆమె పేరు చూసిన స్థానికులు మీడియాకు తెలిపారు.
నిర్లక్ష్యం కారణంగా గతంలోను పలుమార్లు పలువురు సినీ నటులు, ఇతర ప్రముఖులు ఆయా గ్రామాల్లో ఓటర్లుగా నమోదైనట్లుగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

బిజెపికి ఓటేసేందుకు వచ్చిన చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయనున్నారు! ఈ సార్వత్రిక ఎన్నికలలో టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉన్న నియోజకవర్గం బిజెపి అభ్యర్థులు నిలబడిన వాటి కిందకు వస్తుంది.
చంద్రబాబు నివాసం ఖైరతాబాద్ శాసన సభ స్థానంలో ఉంది. పొత్తులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న ఖైరతాబాద్ శాసన సభ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో చంద్రబాబు కమలానికి ఓటు వేయనున్నారు. బిజెపికి ఓటేసేందుకు ఆయన సీమాంధ్రలో ప్రచారం మానుకొని హైదరాబాద్ వచ్చారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications