చూశారా ఈ ఆర్భాటం!: ఎమ్మెల్యే అనుకుంటే.. దిగింది ఆమె భర్త 'పిల్లి సత్తిబాబు'

కానీ గన్‌మెన్ డోర్ తీసేసరికి కారు నుంచి ఆమె భర్త పిల్లి సత్తిబాబు బయటకు వచ్చారు. దీంతో భార్య అధికారాన్ని భర్త చలాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాకినాడ: పొలిటికల్ పవర్ అంటే కుటుంబ సభ్యులంతా కలిసి పంచుకునేది అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఒక్కరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లో వాళ్లు కూడా అదే దర్జా ఒలకబోస్తుంటారు. కాకినాడ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్తిబాబు కూడా ఇదే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

ఆలిని ఇంటికే పరిమితం చేసి ఆయనే ఎమ్మెల్యే మాదిరి హల్‌చల్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నాడు జరిగిన ఒక ఘటనతో ఇదే విషయం మరోసారి రూఢీ అయిందంటున్నారు. ఉదయం 11గం.కు సన్నగా చినుకులు పడుతున్న వేళ.. ఎమ్మెల్యే గారి వాహనం రావడంతో.. అంతా అనంతలక్ష్మి వచ్చి ఉంటారని భావించారు.

kakinada mla pilli ananta lakshmi husband hulchul

కానీ గన్‌మెన్ డోర్ తీసేసరికి వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కారు నుంచి ఆమె భర్త పిల్లి సత్తిబాబు బయటకు వచ్చారు. దీంతో భార్య అధికారాన్ని భర్త చలాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సత్తిబాబు వచ్చిన కారుపై ఏపీ 5DA నంబర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే స్టిక్కర్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఏదేమైనా ఎమ్మెల్యే అయిన భార్యను ఇంటికి పరిమితం చేయడమేంటన్న విమర్శలు మాత్రం కాకినాడలో చాలానే వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+