నేరగాళ్లే: భయమన్న జగన్‌కు కౌంటర్, బాబు భయపెడ్తే

kalva srinivas counter to ys jagan statement
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బతకాలంటేనే భయమేస్తుందన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు సోమవారం నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ నేరగాళ్లే చంద్రబాబును చూసి భయపడతారని కౌంటర్ ఇచ్చారు.

పారిశ్రామికవేత్తలకు, సామాన్యులకు చంద్రబాబు పాలనలో ఢోకా లేదన్నారు. వారికి బాబు పాలన పైన పూర్తి విశ్వాసముందన్నారు. నేరగాళ్లకే బాబు అంటే భయమన్నారు. రాజకీయాల్లో విలువల గురించి, నీతి గురించి, విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడుతుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోందన్నారు.

ఎవరిని చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలో ప్రజలకు తెలుసున్నారు. సమర్థుడైన చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే అభివృద్ధికి ఢోకా లేదన్నారు. చంద్రబాబు భయపెట్టి పార్టీలో చేర్పించుకొని ఉంటే కడప జెడ్పీ స్థానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దక్కేదా చెప్పాలని ప్రశ్నించారు.

ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారన్నారు. పరిటాల హత్యే వైయస్ రాజశేఖర రెడ్డి దాష్టీకానికి నిదర్శనమన్నారు. జగన్ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. నాయకులను భయపెట్టి పార్టీలో కలుపుకుంది వైయస్ రాజశేఖర రెడ్డియేనని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+