వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్తాకు దెబ్బలు ఫ్రీ: జగన్‌కు కాల్వ కౌంటర్, నాని ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kalva Srinivasulu fires at YSR Congress
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో.. ఎరువుల పంపిణీలో ఒక బస్తాకు రెండు లాఠీ దెబ్బలు ఫ్రీ అన్నట్లుగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు బుధవారం మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారన్నారు.

జగన్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందలా ఉందన్నారు. ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడారని విమర్శించారు. వైయస్ పాలనలో 32వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసు స్టేషన్లో ఎరువులు పంపిని చేసిన ఘనత వైయస్‌దే అన్నారు.

ఎరువుల పంపిణీలో బస్తాకు లాఠీ దెబ్బలు ఫ్రీ అన్నట్లుగా వ్యవహరించారన్నారు. సెజ్‌లకు పేదలు, దళితుల భూములు కట్టబెట్టారన్నారు. తనయుడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికే భూములు కట్టబెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యా రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేనిపోని ఆరోపణలు: యనమల

రైతుల రుణమాఫీ పైన విపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రుణమాఫీలు 96 శాతం మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణాలు మాఫీ చేశామన్నారు. కేంద్రం సాయం కూడా అమలు చేశామన్నారు.

రుణమాఫీ నిర్ణయం ఏ రాష్ట్రంలో జరగలేదు : ప్రత్తిపాటి

రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు లేవని, ఇది చరిత్రలో సువర్ణాక్షరలతో లిఖించదగినదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శాసనసభలో రుణమాఫీపై రవికుమార్‌ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. డిసెంబర్‌ 31, 2013 వరకు తీసుకున్న రుణాలు ఈ పథకంలోకి వస్తాయని జీవో స్పష్టంలో పేర్కొనట్లు తెలిపారు. అలాగే జనవరి- మార్చి వరకు కూడా ఈ పథకం వర్తింస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 42 లక్షల 63 వేల మంది రైతులు ఈ పథకం కిందకు వచ్చారని మంత్రి ప్రత్తిపాటి తెలియజేశారు.

English summary
AP government chief whip Kalva Srinivasulu fires at YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X