బతుకమ్మ ఫోటోలు చూస్తూ కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగను ప్రభుత్వ పరంగా వైభంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.
ఆదివారం రవీంద్రభారతిలోని ఆర్ట్‌గ్యాలరీలో తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిత్రకారుడు భరత్‌భూషన్ చిత్రించిన బతుకమ్మ చిత్రాల ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర కూడా ఉందని ఆమె అన్నారు. ఉద్యమం జరుగుతన్నపుడు కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నామని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉండే బతుకమ్మ చిత్రాలను అంతర్జాతీయ ప్రదర్శనకు కృషి చేస్తామన్నారు. బతుకమ్మ పండుగకు పదికోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

బతుకమ్మ చిత్ర ప్రదర్శన
ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ బతుకమ్మపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఇలా తిలకించారు.

భరత్ భూషణ్‌తో కవిత
ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ తాను బతుకమ్మపై తీసిన ఫొటోల గురించి ఎంపీ కల్వకుంట్ల కవితకు వివరిస్తూ ఇలా కనిపించారు.

బతుకమ్మ ప్రదర్శనను ప్రారంభిస్తూ...
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటైన బతుకమ్మ ఛాయాచిత్ర ప్రదర్శనను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.

బతుకమ్మ ప్రదర్సనలో ఇలా..
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో భరత్ భూషణ్ బతుకమ్మపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆరంభించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications