ఉద్యోగుల విభజనపై కమిటీ: ఒంటరి మహిళలకి ఆప్షన్స్

రెండు రోజుల్లో విధివిధానాలను వెబ్‌సైట్లో ఉంచనున్నారు. విధివిధానాల పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తెలుపాలని కమిటీ తెలిపింది.
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పింది. దంపతులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమల్ నాథన్ కమిటీ పేర్కొన్నదని సమాచారం.
ఒకటి రెండు ఏళ్లలో పదవీ విరమణ పొందే వారికి ఆప్షన్లు ఉండవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 371డీ ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని కమిటీ పేర్కొందని తెలుస్తోంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications