బీజేపీ ఎత్తుగడపై చంద్రబాబు భయం అదే..!!

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పరిస్థితులను విశ్లేషించారు. అధికార తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి మనుగడపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు.

ఇక అధికారంలోకి రానని చంద్రబాబు భావించాడని, ఆయనను అరెస్ట్ చేసిన తరువాత సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయని కంచ ఐలయ్య అన్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి లాభించిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనంతగా చంద్రబాబు తిట్టారని, మళ్లీ ఆయనతోనే పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.

Kancha Ilaiah explained Andhra Pradesh politics

ఈ దఫా అధికారంలోకి రాకపోతే పార్టీ బతకదని చంద్రబాబు భావించారని, అందుకే- ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనుకాడలేదని కంచె ఐలయ్య అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉండటం, టీడీపీ మీద ఆధారపడటం.. ఆ పార్టీకి ఎంతో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు.

ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐలయ్య మాట్లాడారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కూటములు కడుతున్నాయని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ ది ఏమీ లేదని, భవిష్యత్తులో ఆయనను బీజేపీ విలీనం చేసుకుంటుందని, ఈ విషయంలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేయవచ్చని కంచె ఐలయ్య తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించవచ్చని, ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ను సీఎంగా, రామ్ మాధవ్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించవచ్చని చెప్పారు.

దేశంలో చిన్న/ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని కంచె ఐలయ్య అన్నారు. టీడీపీని కూడా చిన్న పార్టీగా చేసి, కాపులను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ ఎత్తుగడ అని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా భయపడుతున్నారని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ముందుకు వెళ్లాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. తన రాజకీయ పోరాటాన్ని రాష్ట్రానికే పరిమితం చేసుకోకుండా, జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం జగన్ కు ఉందని, అది సాధ్యపడాలంటే పొత్తు తప్పకపోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ తో సమస్య ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలను చూసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+