ఉద్దానం ప్రజలకు జగన్ ఉన్నాడు .. మరి కనిగిరి ప్రజలకు ఎవరున్నారు..?
ఉద్దానం పేరు చెప్పగానే అక్కడున్న కిడ్నీ బాధితులే ముందుగా గుర్తుకు వస్తారు.ఒకప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేసిన ఈ కిడ్నీ సమస్య సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాప కింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిచింది. వీరిని పట్టించుకున్న నాథుడే లేరు. కానీ జగన్ హయంలో ఉద్దానం ప్రజల బ్రతుకులు మారాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ సుధీర్ఘ సమస్యకు ఐదేళ్లలోనే చెక్ పెట్టడం జరిగింది.
ఇచ్చిన మాట ప్రకారం తాగునీటి ఏర్పాటు, కిడ్నీ బాధితుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు. పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇలా ఉద్దానం ప్రజల సమస్యకు జగన్ ఒకింత రిష్కారం చూపించారనే చెప్పాలి. సరిగ్గా ఉద్దానం లాంటి ప్రదేశమే ఏపీలో మరొకటి ఉంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి. ఫ్లోరైడ్ వాటర్ కారణంగా కనిగిరిలో చాలామంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. అనేక ఏళ్లుగా ఫ్లోరైడ్ వాటర్ కారణంగా అక్కడ ప్రజలు కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ , ఇక్కడి ప్రజలు బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు..పోతున్నారు. కానీ వీళ్ల సమస్యకు పరిష్కారం చూపించే ప్రజా నాయకుడు మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ చొరవ తీసుకుని ఇక్కడి బాధితులకు అండగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వస్తున్నారని చెప్పి కనిగిరి ఎమ్మెల్యేతో పాటు, అక్కడి ప్రజాప్రతినిధులను, వ్యాపారస్తులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి వస్తుందనుకుని ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులతో పాటు, ప్రజలు సైతం భారీగానే అక్కడకు చేరుకున్నారు. తీరా హీరోయిన్ మీనాక్షి చౌదరికి బదులుగా వేదికపైకి కిడ్నీ వ్యాధి బారిన పడ్డ వృద్దురాలను తీసుకురావడంతో అక్కడున్న వారంత షాక్ అయ్యారు.
అక్కడకు వచ్చిన వారికి కనిగిరిలో ఏం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు.ఫ్లోరెడ్ వాటర్ కారణంగా అక్కడ ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలియజేశారు.దీంతో కొందరు ముందుకొచ్చి తమకు తోచిన సాయం కిడ్నీ బాధితులకు అందజేశారు.ఇలా దాదాపు రూ.17 లక్షల వరకు విరాళాలు అందాయి.అయితే కనిగిరిలో ఇంత జరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం రావడం లేదు.కొందరు ఆఫీసర్ల అవినీతి కారణంగా ఈ విషయం పై వరకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుగజేసుకుని బాధితులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఉద్దానం బాధితులకు జగన్ పరిష్కారం చూపించినట్టుగా , కనిగిరి ప్రాంత ప్రజలకు ఏ నాయకుడు పరిష్కారం చూపిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications