Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ట్రబుల్ షూటర్ గా కన్నా ? విజయవాడతో పని మొదలు ! జనసేనతో పొత్తుపై క్లారిటీ !

తాజాగా టీడీపీలో ఎంట్రీ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కన్నా సేవల్ని పూర్తి స్దాయిలో వాడుకునే అవకాశాలున్నాయి.

ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కన్నా లక్ష్మీనారాయణను తాజాగా టీడీపీలోకి చేర్చుకున్న అధినేత చంద్రబాబు.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో నేతల కుమ్ములాటలతో అగమ్య గోచరంగా మారుతున్న పార్టీని గాడిన పెట్టేందుకు ట్రబుల్ షూటర్ పాత్ర అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఇవాళ విజయవాడకు వచ్చి పార్టీలో రెబెల్ నేతలతో భేటీ అయ్యారు.

టీడీపీలో కన్నా డ్యూటీ మొదలు

టీడీపీలో కన్నా డ్యూటీ మొదలు

టీడీపీలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వచ్చీ రాగానే పని మొదలుపెట్టేశారు. ముఖ్యంగా తనకు అస్సలు గిట్టని టీడీపీలో చేరికే ఓ సంచలనం అయితే ఇప్పుడు ఆయన రాగానే మొదలుపెట్టిన ప్రతీ పనీ సంచలనాలు రేకెత్తించేలా కన్నా ప్లాన్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. సహజంగా అయితే పార్టీలోకి రాగానే అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లు, ముఖ్య నేతల్ని కలవాల్సింది పోయి.. ఆయన రెబెల్ నేతలతో భేటీ అయ్యారు. తద్వారా తనకు అధినేత అప్పగించిన బాధ్యతేంటో చెప్పకనే చెప్పేసారు.

ఇంట్లో బెజవాడ నేతలతో భేటీ

ఇంట్లో బెజవాడ నేతలతో భేటీ

విజయవాడలో టీడీపీ నేతల కుమ్ములాటలతో పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే స్దానిక సంస్ధల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపుకు ఈ కుమ్ములాటలే కారణమయ్యాయి. అలాగే ఇక్కడి నాయకులు ఇప్పటికీ తీరు మార్చుకునేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ టీడీపీకి సమస్యగా మారిన పలువురు నేతలతో కన్నా ఇవాళ భేటీ అయ్యారు. ఇందులో పార్టీలో కేశినేని ప్రత్యర్ధులుగా పేరున్న సోదరుడు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారు ఉన్నారు. వీరితో కలిసి అల్పాహారం చేస్తూ కన్నా మంతనాలు జరిపారు. బుద్దా వెంకన్న నివాసంలో ఈ భేటీ జరిగింది.

 కన్నాకు నేతల ధన్యవాదాలు

కన్నాకు నేతల ధన్యవాదాలు


కన్నాతో భేటీ తర్వాత బెజవాడ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీలోకి కన్నా రాకను వారు స్వాగతించారు. టీడీపీలో చేరిన కన్నాకు కార్యకర్తల తరఫున కేశినేని చిన్ని ధన్యవాదాలు తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. కన్నా అనుభవంతో అందరూ కలిసి పని చేస్తామని ప్రకటించారు. రాక్షస పాలనను తరిమి కొట్టి, ప్రజా పాలన అందిస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు.

 టీడీపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు

టీడీపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు


అనంతరం మాట్లాడిన కన్నా జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ గన్నవరం ఘటనలపై స్పందించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాటం చేయలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై పోరాడాలన్నారు. రాష్ట్రాభివృద్ధి, అమరావతి రాజధానిని దృష్టిలో పెట్టుకునే టీడీపీలో చేరాన్నారు. తాను కులనాయకుడిని కాదని, రాజకీయ నాయకుడిని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల అభీష్టం మేరకే ముందుకెళ్తే బాగుంటుందని తన అభిప్రాయం అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, సమస్యలు చెబితే ఎదురుదాడి చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

 చంద్రబాబు అప్పగించిన బాధ్యత ఇదేనా ?

చంద్రబాబు అప్పగించిన బాధ్యత ఇదేనా ?

టీడీపీలో చేరిన కన్నాకు చంద్రబాబు కీలక బాధ్యతలే అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతిలో పార్టీ బలోపేతంతో పాటు వచ్చే ఎన్నికల్లో కొన్ని కీలక స్ధానాలు గెలిపించుకుని రావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ స్ధానాల్లో కన్నా వర్గీయులు ఎక్కువగా ఉన్నందున ఆయా స్ధానాల బాధ్యత తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి ప్రాంతంలో టీడీపీ విజయానికి ప్రణాళికలు రచించాలని కూడా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కన్నా డ్యూటీ మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇవాళ విజయవాడ రెబెల్స్ తో భేటీ ఇందులో భాగమేనని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+