జగన్ కోసం కపిల్ సాహూ ఆన్ డ్యూటీ- సైలెంట్ గ్రౌండ్ వర్క్, కీలక మార్పులు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి - వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇందు కోసం కొత్త వ్యూహకర్తను రంగం లోకి దించారు. తమిళనాడులో విజయ్ ను గెలిపించిన వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ కోసం సైలెంట్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. పార్టీలో కీలక మార్పులకు సిద్దం అవుతున్నారు.

ఏపీలో మిషన్ -2029 మొదలైంది. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం కూటమి- వైసీపీ తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. అందులో భాగంగా కూటమి నేతలు జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పైనా జగన్ పోరాటం తీవ్రతరం చేసారు. జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంత కాలంగా ప్రత్యేకంగా ఒక టీం పని చేస్తోంది.

వ్యూహం మార్చిన వైసీపీ.. రాజ్యసభలో జగన్ బాబాయ్ కీలక డిమాండ్
వ్యూహం మార్చిన వైసీపీ.. రాజ్యసభలో జగన్ బాబాయ్ కీలక డిమాండ్
Kapil Sahu Vijay s Political Strategist Now Working for Jagan in Andhra Pradesh here the details

అదే విధంగా వైసీపీకి 2019 లో ప్రశాంత్ కిశోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెర వెనుక సేవలు అందించాయి. 2024 లో జగన్ ఓటమి తరువాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక, వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్ రంగంలోకి దిగారు. తమిళనాడులో విజయ్ గెలుపు లో అన్నా తానై వ్యవహరించిన కపిల్ సాహు టీం జగన్ కోసం సైలెంట్ గా పని మొదలు పెట్టింది.

వైసీపీ కోసం కపిల్ సాహు ను రంగంలోకి దించటం కోసం విజయ్- జగన్ ఉమ్మడి మిత్రులు తెర మీదకు వచ్చారు. కపిల్ సాహు ను జగన్ కోసం పని చేసేందుకు ప్రాధమికంగా చర్చలు చేసినట్లు సమాచారం. విజయ్ కోసం రెండేళ్లు కపిల్ సాహు పని చేసి సక్సెస్ అయ్యారు. వైసీపీలో నేతలు.. వారి బలాలు- బలహీనతలతో పాటుగా క్షేత్ర స్థాయిలో అమలు చేసిన కార్యకలాపాల గురించి ఇప్పటికే ఈ టీం జగన్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక.. పార్టీలో ముందుగా అధికార ప్రతినిధుల వ్యవస్థ బలోపేతం పైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

మరో వివాదంలో మంత్రి వాసంశెట్టి, వైసీపీ నేతలతో కలిసి- చంద్రబాబు హెచ్చరించినా..!!
మరో వివాదంలో మంత్రి వాసంశెట్టి, వైసీపీ నేతలతో కలిసి- చంద్రబాబు హెచ్చరించినా..!!

పార్టీ డిజిటల్ ప్రచారం.. సోషల్ మీడియాతో యువతకు దగ్గర అయ్యే విధంగా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ప్రస్తుతం వైసీపీ కోసం పని చేస్తున్న సోషల్ మీడియా మద్దతు దారులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఫార్ములా సిద్దం చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ నుంచి కొత్త కార్యాచరణ.. వేగంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళిక ల పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కపిల్ సాహు సేవల పైన త్వరలోనే జగన్ అధికారిక ప్రకటన చేస్తారని పార్టీ నేతల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+