బాబుని తప్పుపట్టిన దర్శకరత్న: 'దాసరి! జగన్ వలలో పడకండి'

విజయవాడ: దర్శకరత్న దాసరి నారాయణ రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వలలో పడవద్దని ఏపీ కాపు కార్పోరేషన్ చైర్మన్ చమలశెట్టి రామానుజయ గురువారం అన్నారు. ఆయన దాసరికి బహిరంగ లేఖ రాశారు.

అందరివాడినే: దాసరి, ముద్రగడ భేటీలో చిరంజీవి, 'పవన్ వస్తే కాదనం'

దాసరితో ముఖ్యమంత్రి చంద్రబాబు పైకి తుపాకీ ఎక్కుపెట్టేలా కాపు నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు కార్పోరేషన్ ద్వారా కాపు యువత అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని ఆ లేఖలో దాసరిని కోరారు. దాసరి మాత్రం వైసిపి వలలో పడవద్దన్నారు.

హైదరాబాదులో కాపు నేతల సమావేశంపై రాష్ట్రంలోని కాపు జాతి మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే కాపుల సంక్షేమానికి రూ.885 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాపుల అభ్యున్నతికి కట్టుబడ్డ తమ ప్రభుత్వాన్ని అనుమానం వ్యక్తం చేయడం సబబు కాదన్నారు. విపక్షం మాయలో పడి కాపు జాతికి అన్యాయం చేయొద్దని హితవు పలికారు.

Kapu chairman writes letter to Dasari

రెండు రోజుల క్రితం కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావును కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాపు నేతలు దాసరి నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దాసరి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కారు నాన్చుడు ధోరణితో ముందుకెళుతోందన్నారు. ముద్రగడ చేపట్టే ఉద్యమానికి మద్దతుంటుందని చెప్పారు. కాపుల కోసం ముద్రగడ పట్టువదలకుండా పోరాడుతున్నారన్నారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేసినా కుటుంబంతో సహా ప్రాణత్యాగానికి సిద్ధమని ముద్రగడ తమకు చెప్పారన్నారు. పరిస్థితిని ప్రభుత్వం అంతవరకూ తీసుకు రావొద్దనేదే తమ డిమాండ్ అన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తాము అడుగుతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+