Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోమయంలో ఆంద్రా కాపులు.. !!

ఆంద్రాలో కాపుల ప‌రిస్తితి చౌర‌స్తాలో చంటిపిల్లాడి మాదిరి త‌యార‌య్యింది. రిజ‌ర్వేష‌న్ల కోసం చ‌కోర ప‌క్షుల్లా ఎదురుచూస్త‌న్న కాపుల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ వేసారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. కాపు రిస‌ర్వేష‌న్లు సాద్యం కాద‌ని, అలాంటి హామీలు వైసీపి ఇవ్వ‌బోద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్ట‌న‌ట్టు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబందించిన బిల్లును కేంద్రానికి పంపించి కాపు సామాజిక‌వ‌ర్గానికి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోడంతో కాపులు తెలుగుదేశం చేస్తుంది డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. ఇక ఏపి లో అదే సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల కాస్తో కూస్తో సానుకూలంగా కాపులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఐన‌ప్ప‌టికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌త్తు తెల‌పాల‌న్న అంశం పై కాపులు సందిగ్దంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఆంధ్రా కాపులు.. ఎవ‌రు న్యాయం చేస్తార‌న్న అంశం పై సందిగ్ద‌త‌..

ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఆంధ్రా కాపులు.. ఎవ‌రు న్యాయం చేస్తార‌న్న అంశం పై సందిగ్ద‌త‌..

రిజర్వేషన్ అనే దానిని త్రిశంకు స్వర్గంలో ఉంచి, వారి ఓట్లతో చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నార‌న్న‌ అభిప్రాయం కాపు సామాజిక వ‌ర్గంలో వ్యక్తం అవుతోంది. జగన్ తాను ఇవ్వలేనంటూ తేల్చి చెప్పాడని, మిగిలిన పార్టీలు కాపులను మభ్యపెట్ట‌డానికే ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నదని పలువురు అంటున్నారు. కనీసం ముస్లిం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధిలో వందోవంతు కూడా చంద్రబాబు సర్కార్ చేయడం లేదని కాపులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అదే కావు సామాజిక వ‌ర్గంలో కొంద‌రు నేత‌లు మాత్రం చంద్ర‌బాబు ఆమాత్రం ఐనా చేసార‌ని ప్ర‌శంసించ‌డం విశేషం. మరోవైపు పవన్ కల్యాణ్ త‌న‌కు కులాలు అంటవు అని చెప్పుకుంటూనే... కాపు ఓట్లన్నీ తనకు గంపగుత్తగా వచ్చి పడిపోతాయనే అభిప్రాయంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు పై న‌మ్మ‌కం.. కాపు వ‌ర్గం రెండుగా చీలే అవ‌కాశం...

చంద్ర‌బాబు పై న‌మ్మ‌కం.. కాపు వ‌ర్గం రెండుగా చీలే అవ‌కాశం...

రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ కావాలనే మాట చాలారోజులుగా వినిపిస్తూనే ఉంది. వారికి రిజర్వేషన్ ఇస్తాననే తాయిలం చూపించి.. చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పటిదాకా దానిని నెరవేర్చలేదు. పైగా రిజర్వేషన్ కల్పించడానికి కారణాలు చెప్పాలంటూ.. కేంద్రం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంజూనాథ క‌మీష‌న్ లో అన్నీ అంశాలు పొందుప‌రిచామ‌ని కేంద్రానికి స‌మాధానం ఇచ్చారు బాబు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఆయోమ‌యంలో కాపులు..

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఆయోమ‌యంలో కాపులు..

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేనంటూ తెగేసి చెప్పినందుకు ఆ వర్గం వారంతా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ప్లకార్డులు పట్టుకుని ఆయన పాదయాత్రలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంతకి కాపులు ఎవ‌రి ప్ర‌లోభాల‌కు లోన‌వుతున్నార‌నే అంశం తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చంది. తమ డిమాండ్లు సాధించుకోవడంలో కాపులు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారా? లేక రాజ‌కీయ నాయ‌కుల ఉచ్చులో ప‌డుతున్నారా? అనే అమమానాలు పలువురిలో కలుగుతున్నాయి.

జ‌న‌సైనానిని న‌మ్మాలా.. ? వ‌ద్దా అంత‌ర్మ‌ద‌నంలో కాపులు

జ‌న‌సైనానిని న‌మ్మాలా.. ? వ‌ద్దా అంత‌ర్మ‌ద‌నంలో కాపులు

కాపుల్లో నిర్దిష్టంగా కొంతశాతం మేర ఓట్లు పవన్ కి ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. కాగా రిజర్వేషన్ అనేది నిజంగా కాపుల అభీష్టం అయితే గనుక, పవన్ కల్యాణ్ కాపుల‌కు వంద శాతం రిజ‌ర్వేష‌న్లు సాదిస్తాన‌ని హామీ ఇవ్వ‌గ‌ల‌డా అన్న అంశం పై సందేహాలు నెల‌కొన్నాయి. రిస‌ర్వేష‌న్లు కాకుండా కార్పోరేష‌న్ ద్వారా కాపుల ఆర్థిక స్థితిగ‌తుల‌ను మార్చేస్తానంటే ఎంత‌మంది న‌మ్ముతార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోంతుంది. మ‌రి ఇటు ఐన వాడు హామీ ఇవ్వ‌క, హామీ ఇచ్చిన వాడు స‌కాలంలో నెర‌వేర్చ‌క ఎవ‌రిని న‌మ్మాలో తెలియ‌క చౌర‌స్తాలో చంటిపిల్లాడిలా తిక‌మ‌క ప‌డుతున్నారు ఆంద్ర కాపులు..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+