వైసీపీలోకి ముద్రగడ - సీఎం జగన్ కీలక బాధ్యతలు..!!

ఎన్నికల వేళ గోదావరి రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ప్రధానంగా కాపు ఓట్ బ్యాంక్ పైనే ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరటంతో..సీఎం జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

వైసీపీలోకి ముద్రగడ
కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో జాయిన్ అయ్యారు. తన కుమారుడు గిరితో పాటుగా ముఖ్య అనుచరులతో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలోనూ గోదావరి జిల్లాల్లో క్రియాశీలకంగా పని చేసారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ముద్రగడ పని చేసారు. 1999లో కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్, టీడీపీలోనూ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబు హాయంలో కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాటం చేసారు. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Kapu leader Mudragada Joins in YSRCP May play key role in Godavari districts

మారుతున్న లెక్కలు
కొద్ది రోజుల క్రితం ముద్రగడను తమ పార్టీలోకి రావాలని జనసేన నేతలు ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి ముద్రగడను ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. కానీ, పవన్ రాకపోవటంతో ముద్రగడ తన నిర్ణయం మార్చుకున్నారు. వైసీపీ నుంచి ఆహ్వానం రావటంతో జగన్ కు మద్దతుగా పని చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయటం లేదు. ఎలాంటి కండీషన్లు లేకుండానే వైసీపీలో చేరినట్లు ముద్రగడ వెల్లడించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ టీడీపీ ఇంచార్జ్ వర్మ మద్దతు దారులు ఈ ప్రకటనతో నిరసనలకు దిగారు. వర్మ పోటీలో ఉండాలని నినదించారు. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు.

కీలక బాధ్యతలు
ముద్రగడకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. వైసీపీ తరపున గోదావరి జిల్లాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ముద్రగడ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. పవన్ పోటీ చేైస్తున్న పిఠాపురంలో ముద్రగడ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమచిత స్థానం కల్పిస్తామని ముద్రగడకు హామీ దక్కింది. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. గోదావరి జిల్లాల్లో మరి కొంత మంది నేతలు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో..ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ముద్రగడ వైసీపీలో చేరికతో జిల్లాలో ఎన్నికల సమయంలో సమీకరణాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+