సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గడె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజును అధికారులు సస్పెండ్ చేయగా తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. నాగరాజు ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత మరి కొందరి పైన చర్యలు ఉంటాయని సమాచారం.
ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కృష్ణలంక సీఐగా పని చేసిన నాగరాజు పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో.. ప్రభుత్వం ఇప్పటికే నాగరాజు ను సస్పెండ్ చేసింది. తాజాగా సీఐ పై హత్యాయత్నం కేసు నమోదు చేసారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు..స్వయంగా ఫిర్యాదు తీసుకున్న సీపీ రాజశేఖర్‌బాబు..కేసు ... నాగరాజుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీఎన్ఎస్ సెక్షన్ 101(1), 127(4), 127(6) కింద కేసులు నమోదు చేసారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంతో పాటు, క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో కూడా సీఐ వేధింపుల ప్రస్తావన రావడం వల్ల ఈ వివాదం మరింత తీవ్రమైంది.

కేసు నమోదు.. కీలక పరిణామాలు
రాజకీయంగానూ ఈ వ్యవహారం మలుపు తీసుకుంది. పోలీసు అధికారుల పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. సీఐ నాగరాజు తన కుమారుడు గురించి వాకబు చేసిన సమయంలో తనతో వ్యవహరించిన తీరు పైన తల్లి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. సీఐ పై సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ సీఎం జగన్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తో పాటుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఐతో పాటుగా విజయవాడ సీపీ, డీజీపీ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కాగా.. ఈ కేసులో మరి కొందరు అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. దీంతో.. రానున్న రెండు రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications