లంచం అడగటంలో దేశంలోనే టాప్ 2లో ఉన్న శాఖలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురయ్యే అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా పౌరులు తమ గళాన్ని వినిపించడానికి ఓ నూతన డిజిటల్ ప్లాట్ ఫామ్ తెరపైకి వచ్చింది. దీనిద్వారా ప్రజలు తమకు ఎదురైన లంచం, అవినీతి, అధికారులు, సిబ్బంది ప్రవర్తన.. వంటి వివరాలను నమోదు చేయవచ్చు. ప్రభుత్వ విధానాలలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన ఓ వినూత్న ప్రయత్నం ఇది.

అదే Bribes.fyi. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆర్యన్ నిషాద్ రూపొందించిన ఈ వెబ్‌సైట్ ఇది. సాధారణ ఆన్‌లైన్ నివేదికల పోర్టళ్లలా కాకుండా, ఈ సైట్ లో వివరాలు నమోదు చేయడానికి వినియోగదారులు నిర్దుష్టంగా ఎటువంటి అకౌంట్ నూ వినియోగించాల్సిన అవసరం లేదు. వారి ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదు. ఫిర్యాదిదారుల వివరాలన్నీ కూడా రహస్యంగా ఉంచుతారు. కనీసం ఈమెయిల్ ఐడీని కూడా అందులో పొందుపర్చనక్కర్లేదు.

Bribes fyi Report Alleged Bribes in India Anonymously No Account Needed Corruption Trends documenting

లంచం అడిగిన ప్రభుత్వ శాఖ పేరు, ఆ ఘటన చోటు చేసుకున్న ప్రాంతం, డిమాండ్ చేసిన లంచం మొత్తం, దాన్ని తాము చెల్లించారా లేదా అనే ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇక్కడ పంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమాచారాన్ని నమోదు చేసే పౌరుల భద్రతకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. బాధితుల నుంచి సేకరించిన సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న లంచాల వివరాలు, వాటి సరళిని ఈ పోర్టల్ క్రోడీకరిస్తుంది.

రైతు రుణమాఫీని ప్రకటించిన సీఎం విజయ్: వీరికి సంపూర్ణ వర్తింపు
రైతు రుణమాఫీని ప్రకటించిన సీఎం విజయ్: వీరికి సంపూర్ణ వర్తింపు

ఆగస్టు 15 వరకు దేశంలో 251 నగరాల నుంచి లంచానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. 616 లంచం కేసుల వివరాలు ఇందులో నమోదయ్యాయి. అత్యధికంగా పోలీస్ శాఖలో 337 లంచం డిమాండ్లు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత రవాణా శాఖ రెండో స్థానంలో నిలిచింది. ఆర్టీఓల్లో 88 లంచం కేసులు రికార్డయ్యాయి. రెవెన్యూ, భూ రికార్డుల విభాగంలో 69, పాస్‌పోర్ట్ కార్యాలయాలలో 43, మున్సిపల్ కార్పొరేషన్లలో 29 కేసులు ఉన్నట్లు తేలింది.

ఉజ్జయినీ ఆలయం క్యూలైన్ లో భారీగా తొక్కిసలాట: శ్రావణ సోమవారం.. పైగా నాగపంచమి
ఉజ్జయినీ ఆలయం క్యూలైన్ లో భారీగా తొక్కిసలాట: శ్రావణ సోమవారం.. పైగా నాగపంచమి

ఈ ప్లాట్‌ఫామ్ వెల్లడించిన నివేదికల విశ్లేషణలో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. లంచం డిమాండ్ ఎదుర్కొన్న వారిలో దాదాపు 38 శాతం మంది దాన్ని ఇవ్వడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించినట్లు వెల్లడైంది. అయినప్పటికీ చాలా సందర్భాల్లో అధికారులు లంచం తీసుకోకుండానే వారు కోరిన ప్రభుత్వ సేవలను సకాలంలో అందించడం ఇక్కడ గమనార్హం. ఇది సామాన్య ప్రజలలో వస్తున్న చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధి
నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధి

లంచం కోరిన ఘటనలను నివేదించే సమయంలో ప్రజల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత కల్పించినట్లు దీని నిర్వాహకులు తెలిపారు. వెబ్‌సైట్ సందర్శించే వారి ఐపీ అడ్రస్‌లను కూడా సర్వర్లలో నేరుగా భద్రపరచకుండా, హ్యాష్ రూపంలోకి మార్చడం ద్వారా భద్రతను పెంచారు. రిపోర్ట్ సమర్పించే క్రమంలో వినియోగదారులు తమకు ఇబ్బంది అనిపించిన వ్యక్తిగత వివరాలను గానీ, మొబైల్ నంబర్లను గానీ సొందుపర్చాల్సిన అవసరం కూడా లేదని ఈ పోర్టల్ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+