LokeshKanagaraj: తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. నువ్ తోపు హీరో అన్నా..!
కంటెంట్ ఈజ్ కింగ్ అన్న సంగతి ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతోంది. కథలో కొత్తదనం, కంటెంట్ ఉంటే చాలు అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులు, ఫ్యాన్స్ ను అలరించడంలో విఫలం అవుతున్నాయి. కానీ కొత్త హీరోలు, యువ నటీనటులు తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
తాజాగా తమిళ ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'డీసీ'.. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ఘన విజయం సాధించింది. పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకెళ్తోంది. కథ, మేకింగ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇక అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఇప్పటికే డీసీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 84 కోట్లకు పైగా రాబట్టింది. త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. దర్శకుడిగానే కాదు నటుడిగానూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డీసీ మూవీకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.

ఈ మూవీలో లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. తమిళనాడుతో సమానంగా తెలుగులోనూ ఈ చిత్రం కలెక్షన్స్ ను రాబడుతోంది. డీసీ మూవీకి తొలి రోజున రూ. 1.52 కోట్ల వసూల్లు రాబట్టింది. ఇక రెండో రోజున రూ. 2.35 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం.
మౌత్ టాక్ తోనే..
అలా రోజురోజుకూ సినిమా మౌత్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ అందుకుంది. తాజాగా తొమ్మిదో రోజున రూ. 1.75 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది. అయితే డీసీ మూవీపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. డీసీ మువీ చాలా ఒరిజినల్ గా.. అద్భుతమైన సినిమా అన్నారు. ప్రతి అంశాన్ని ఆస్వాదించాను.. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు అంటూ ప్రశంసించారు. ఈ మూవీ మున్ముందు ఇంకెన్ని రికార్డుల్ని కలెక్ట్ చేస్తుందో చూడాలి.













Click it and Unblock the Notifications