బీజేపీ కొత్త టీం ప్రకటన: పురందేశ్వరి కి ఊహించని పదవి, తెలంగాణ నేతలకు షాక్....!!

బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ టీం ను ఎట్టకేలకు ప్రకటించారు. ఏపీకి ప్రాధాన్యత పెరిగింది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరికి ఊహించని పదవి దక్కింది. ఏపీ నేతలకు జాతీయ కమిటీలో కీలక పదవులు కేటాయించారు. అదే సమయంలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు. ఇక.. కొందరు కేంద్ర మంత్రులకు పార్టీ పదవుల ద్వారా కొత్త సంకేతాలు ఇచ్చారు.

బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను ఎంపిక చేసారు. వారిలో ఏపీ నుంచి పురందేశ్వరి, రాం మాధవ్ కు సైతం పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. వీరిద్దరితో పాటుగా వసుంధర రాజే సైతం ఉపాధ్యక్షురాలిగా ఉండనున్నారు. ఇక, ఏపికి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డిని పార్టీ జాయింట్ కో ఆర్డినేటర్ గా నియమించారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీ కి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.

నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధి
నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధి
BJP Unveils Nitin Nabin s New National Team with Major Organisational changes new list is here

కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను పార్టీ కోశాధికారిగా నియమించారు. దీని ద్వారా పీయూష్ మంత్రివర్గం లో కొనసాగటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. పార్టీలో కీలకమైన కార్య నిర్వహణా కార్యదర్శిగా తిరిగి బీఎల్ సంతోష్ ను కొనసాగిస్తూ నిర్ణయించారు. కాగా, ఈ సారి జాతీయ కార్యవర్గం లో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదు.

బీజేపీ నుంచి ప్రస్తుతం ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో అమర్ పాల్ మౌర్య న నియమించారు. బీజేపీ కార్యాలయ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్ కు బాధ్యతలు కేటాయించారు. ఇక.. సంస్థాగత జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా శివప్రకాష్‌ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోవటం పైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!
మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!

ఈ సమయంలో నేతలకు పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇవ్వకుండా.. రాష్ట్రానికి పరిమితం చేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రిగా అవకాశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం రాజ్యసభ సభ్యుడి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. జాతీయ కమిటీలో పార్టీ చేసిన నియామకాల ద్వారా.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+