అమరావతి స్టేటస్ రిపోర్ట్- నిర్మాణాలు, అప్పులు, ఖర్చు అసలు లెక్క ఇదీ..!!

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. తాజాగా స్టీల్ బ్రిడ్జితో పాటుగా మంత్రుల క్వార్టర్లను ప్రారంభించారు. కాగా, అమరావతి కోసం తీసుకున్న రుణాలు.. చేసిన ఖర్చుతో పాటుగా నిర్మాణాల ప్లానింగ్ పైన ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ వేదిగా మంత్రి నారాయణ రాజధాని స్టేటస్ రిపోర్ట్ వెల్లడించారు. భవిష్యత్ ప్రణాళికల పైనా క్లారిటీ ఇచ్చారు.

అమరావతిలో ప్రస్తుత పరిస్థితులతో పాటుగా రైతులకు హామీల అమలు పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీలో మంత్రి నారాయణ పూర్తి వివరాలను వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై మంత్రి మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFC తదితర సంస్థల ద్వారా మొత్తం రూ.41,187.70 కోట్ల రుణం సమకూర్చుకున్నామని తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.అదే విధంగా అమరావతిలో చేపడుతున్న మొత్తం 119 పనులకు సుమారు రూ.66,802 కోట్ల వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు.

మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!
మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!
minister-narayana-explains-the-details-over-capital-amaravati-constructions-and-loans-expenditure

రైతులకు హామీలు అమలు పైనా స్పష్టత

రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న 103 పనులకు రూ.58,093 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను నిలిపి యడం వల్ల నిర్మాణ వ్యయం దాదాపు 25 శాతం పెరిగిందని మంత్రి వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సమీకరించిన భూమికి సంబంధించి 98 శాతం మేర రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించడం పూర్తయిందని, ప్రస్తుతం వాటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.2,248.02 కోట్ల మేర కౌలు చెల్లించామని మంత్రి వెల్లడించారు. అమరావతిలోని 29 రాజధాని గ్రామాల అభివృద్ధి కోసం రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+